‘మజాకా’ (Mazaka) నిన్న రిలీజ్ అయ్యింది. టాక్ సో సో గానే వచ్చింది. వసూళ్లు అయితే చాలా డల్ గా ఉన్నాయి. అయినప్పటికీ ఆనవాయితీగా టీం సక్సెస్ మీట్ పెట్టింది. ఇందులో సందీప్ కిషన్ (Sundeep Kishan) హానెస్ట్ గా సినిమా పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఎలా ఉందో ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “డిసెంబర్ 26న షూటింగ్ మొదలుపెట్టాం. ఫిబ్రవరి 26 కి రిలీజ్ చేసేశాం. 2 నెలల్లో అదీ 36 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసేశాం.
ఈ పీరియడ్లోనే షూటింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ అయిపోయాయి. ప్రసన్న బాబుకి (Prasanna Kumar) నేను థాంక్స్ చెప్పుకోవాలి. త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao), నేను ఆయనతో కలిసి సినిమా చేయాలనే కోరిక బలమైనది. నేను మల్టీప్లెక్స్ ల విజిట్స్ కి వెళ్లాను. సింగిల్ స్క్రీన్స్ కి పోలీస్ పర్మిషన్ కావాలి. వెళ్లొద్దు అని అన్నారు. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతున్నారు, చివర్లో ఏడుస్తున్నారు.
నేను హానెస్ట్ గా చెబుతున్నాను.. సినిమా బాగుంది అని చెప్పిన వాళ్ళకి, ఎంజాయ్ చేశాము అని చెప్పిన వాళ్ళకి.. సినిమా బాలేదు అని చెప్పిన వాళ్ళకి కూడా థాంక్స్. ఎందుకంటే.. మీ ఒపీనియన్ ప్రకారం మీరు చాలా జెన్యూన్ గా ఉన్నట్లు లెక్క. మేము రిస్క్ చేశాం.శివరాత్రి కానుకగా వీకెండ్ కు ముందుగానే రిలీజ్ చేశాం. కానీ అది మాకు వసూళ్ళ పరంగా కలిసి రాలేదు. కానీ టాక్ పరంగా కలిసొచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.