సినిమా థియేటర్లు – ఓటీటీలు! ఈ చర్చ గత కొంతకాలం నడుస్తూనే ఉంది. ఓటీటీలు వచ్చి థియేటర్ల బిజినెస్కు దెబ్బ కొట్టాయి అని కొందరు, ఆసలు ఒకదానికొకటి ఇబ్బంది పెట్టే సమస్యే లేదని ఇంకొరు, దేని మజా దానికి ఉంటుంది అని మరికొందరు అంటున్నారు. సినిమా – బిజినెస్ మీద స్పష్టమైన అవగాహన ఉన్నవారిలో ఒకరైన సురేశ్‌బాబు తాజాగా సినిమా దాని రూపాలు గురించి మాట్లాడారు. ఓటీటీని అడ్డుకోగలమని అనుకోవడం లేదు.
కొవిడ్ రాకపోయుంటే ఓటీటీకి మన ప్రజలు ఇంతగా అలవాటు పడకపోయేవాళ్లు. ఇలాంటి వేదికల వల్ల సినిమా రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే ప్రదర్శన రంగం ఇబ్బందులు పడుతోంది. ఈ కీలక సమయంలో ప్రభుత్వాలు సహకారం అందించాలి. అయితే ఓటీటీలతోపాటు సినిమా థియేటర్లకు మరో పోటీ కూడా త్వరలో వస్తుంది అని సురేశ్‌బాబు చెప్పారు. భవిష్యత్తులో పెద్ద పెద్ద నగరాల్లో సూపర్ స్క్రీన్స్ వస్తాయి. దాంతోపాటు క్లబ్‌హౌస్‌ల తరహాలో అపార్ట్‌మెంట్‌లు, కాంప్లెక్స్‌ల్లో మినీ థియేటర్లు వచ్చేస్తాయి.
మూడు, నాలుగేళ్లలోనే వీటిని మనం చూడొచ్చు. ప్రాజెక్టుల్ని వ్యక్తిగతంగా వివరిస్తూ ఖాతాదారులకి అమ్మడానికి బ్యాంక్‌లు చిన్నసైజు థియేటర్లు ఏర్పాటు చేసుకుంటాయి. వినోద రంగంలో ఇలాంటి మార్పులు చాలా చూస్తారు అని చెప్పుకొచ్చారు సురేశ్‌బాబు.