ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పుడు ఏకంగా డజనుకు పైగా సినిమాలకు సంగీతం అందిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. గతేడాది తన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాటలతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసాడు తమన్. ఇదిలా ఉండగా.. గతంలో తమన్ పై ఎక్కువగా ట్రోలింగ్ జరిగేదన్న సంగతి తెలిసిందే. తన ట్యూన్లు తనే కాపీ కొట్టుకోవడం లేదా తన గురువు రెహమాన్ ట్యూన్లను కాపీ కొట్టడం వంటివి చేసేవాడని తమన్ పై విమర్శలు వచ్చేవి. మరీ ముఖ్యంగా రెహమాన్ సినిమాల్లో సూపర్ హిట్ పాటల ట్యూన్లను కాపీ కొట్టడం వలన ఇతను త్వరగా దొరికేసేవాడు.
దాంతో కొన్నాళ్ళ తరువాత రెహమాన్ ట్యూన్లను టచ్ చెయ్యడం మానేసి.. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ట్యూన్లు కాపీ కొట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ప్రేక్షకులు త్వరగా కనిపెట్టలేకపోయారు. అయితే ‘వి’ సినిమాకి ఏకంగా మరో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్.. ‘రాట్ససన్’ సినిమాకి అందించిన ట్యూన్లు లేపెయ్యడంతో వెనక్కి వెళ్లి చెక్ చేసి అవి కూడా కాపీ ట్యూన్లే అని ప్రేక్షకులు నిర్దారించారు. అయితే ఇప్పుడు తమన్ కాపీ కొట్టకుండా మంచి ట్యూన్స్ ఇస్తున్నాడని అంతా భావిస్తున్నారు. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాకి మ్యూజిక్ అందించిన తమన్.. నేపధ్య సంగీతానికి కూడా ప్రశంసలు అందుకున్నాడు.
అంతేకాకుండా మహేష్- త్రివిక్రమ్ ల సినిమా అనౌన్స్మెంట్ ఇస్తూ ఓ చిన్న వీడియోని విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. దీనికి మ్యూజిక్ అందించింది కూడా తమనే ..! ట్యూన్ కు కూడా మంచి స్పందనే లభించింది. కానీ ఇది ఓ ఇంటర్నేషనల్ ఆల్బమ్ నుండీ తమన్ లేపేసాడని.. అది కనిపెట్టడం కూడా చాలా కష్టమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే ఇక నుండీ తమన్ ఇంటర్నేషనల్ ట్యూన్స్ లేపేస్తాడు అని స్పష్టంగా తెలుస్తుంది.దాని వల్ల ట్రోలింగ్ నుండీ తప్పించుకోవచ్చు. అంతే మరి గ్యాప్ లేకుండా సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలి అంటే కొత్త ట్యూన్లను అతను మాత్రం ఎక్కడ నుండీ పట్టుకొస్తాడు.