తెలుగు, తమిళం, మలయాళ భాషలతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి నటుడిగా వినీత్ మంచి పేరును సొంతం చేసుకున్నారు. సరిగమలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన వినీత్ ప్రేమదేశం సినిమాతో నటుడిగా సత్తా చాటారు. ప్రేమదేశం సినిమా సక్సెస్ సాధించడంతో పాటు వినీత్ కు యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. వినీత్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అప్పటి యువకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ప్రేమ దేశం సినిమా తరువాత వినీత్ తెలుగులో కొన్ని మంచి సినిమాలు చేసినా హీరోగా తెలుగులో ఎక్కువకాలం కొనసాగలేకపోయారు. మలయాళీ అయిన వినీత్ కు తెలుగు భాషపై పట్టు లేకపోవడం వల్ల హీరోగా పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు క్లాస్ పాత్రలకు మాత్రమే సూటయ్యే హీరో కావడంతో మాస్ సినిమాల్లో వినీత్ కు ఆఫర్లు రాలేదు. ప్రేమదేశం తరువాత లవర్ బాయ్, డాన్సర్ రోల్స్ లో ఎక్కువగా నటించిన వినీత్ ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.
అయితే ఇదే సమయంలో వినీత్ మలయాళంలో నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ కావడంతో పాటు నటుడిగా వినీత్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అందువల్ల వినీత్ టాలీవుడ్ కు దూరమయ్యారు. ఇటీవల విడుదలైన రంగ్ దే సినిమాలో వినీత్ నటించారు. మంచి గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలు వస్తే తప్ప తెలుగులో నటించకూడదని వినీత్ భావిస్తున్నారని సమాచారం. తెలుగులో వినీత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!