ఈ నెల అక్టోబర్ 19వ తేదీన భగవంత్ కేసరి, లియో సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాల మధ్య కొన్ని పోలికలు ఉండగా ఆ పోలికలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల టైటిల్స్ లో సింహం ఉంది. లియో తెలుగు అర్థం సింహం కాగా కేసరి అంటే కూడా సింహం అనే అర్థం ఉంది.
అటు భగవంత్ కేసరి ఇటు లియో సినిమాలకు బీజీఎం హైలెట్ గా నిలిచింది. లోకేశ్ కనగరాజ్ సినిమాలకు వరుసగా పని చేస్తున్న అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా భగవంత్ కేసరి సినిమాకు బాలయ్య సినిమాలకు వరుసగా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న థమన్ మ్యూజిక్ అందించడం గమనార్హం. ఈ రెండు సినిమాలలో హీరోలు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించి మెప్పించారు.
వయస్సుకు తగిన పాత్రలలో నటించి అటు బాలయ్య ఇటు విజయ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం. తమ కుటుంబం కోసం ప్రాణాలకు తెగించే పాత్రలలో హీరోలు కనిపించారు. ఈ రెండు సినిమాలలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో హీరోలు తమ పిల్లలు కెరీర్ పరంగా సక్సెస్ కావడానికి ఎంతో కష్టపడతారు.
(Bhagavanth Kesari) భగవంత్ కేసరి, లియో ఒకేరోజు రిలీజ్ కావడంతో కొంతమంది ఫ్యాన్స్ ఒకేరోజు రెండు సినిమాలను చూశారు. మాస్ సినిమాలను ఇష్టపడేవారికి భగవంత్ కేసరి నచ్చగా క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు లియో మూవీ నచ్చుతుంది. రెండు సినిమాలలో కొంతమంది ప్రేక్షకులకు రెండూ నచ్చాయి. ఈ రెండు సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.