తెలుగులో చాలామంది హీరోయిన్లు కెరీర్ లో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఒకే ఒక్క సక్సెస్ తో తమ రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకే ఒక్క సక్సెస్ వస్తే యంగ్ హీరోయిన్లు తమ పారితోషికాలతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. సినిమా రంగంలో హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం సులువేం కాదు. రేయింబవళ్లు ఎంతో శ్రమించి సరైన కథను ఎంచుకుంటే మాత్రమే సక్సెస్ దక్కుతుంది.
రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందD సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల ప్రస్తుతం ఒక్కో సినిమాకు 72 లక్షల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి ఆ సినిమా సక్సెస్ సాధించకపోయినా రెమ్యునరేషన్ ను పెంచేశారు. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు విజయాలతో హ్యాట్రిక్ సాధించిన కృతిశెట్టి ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.
ఖిలాడీ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయతి కూడా రెమ్యునరేషన్ ను పెంచేశారని సమాచారం అందుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం హీరోయిన్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోతున్నారు. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ హీరోయిన్లు ఫాలో అవుతున్నారు. డీజే టిల్లు మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న నేహాశెట్టి కూడా పారితోషికాన్ని పెంచేశారు. హీరోయిన్ల పారితోషికం నిర్మాతలను కూడా భయపెట్టే విధంగా ఉండటం గమనార్హం.
ఈ హీరోయిన్ల భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా సక్సెస్ సాధిస్తే వీళ్ల రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. మరోవైపు స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పూజా హెగ్డే, రష్మిక, సమంత, తమన్నా మరికొందరు హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు.