జయ ప్రకాష్ రెడ్డి (Jaya Prakash Reddy) .. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. 6 .1 అడుగుల మనిషి. గంభీరమైన రూపం, గొంతు. చూడగానే ఎవ్వరైనా కంగారు పడటం సహజం. కానీ ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఆంధ్రప్రదేశ్..లోని గుంటూరు కి చెందిన ఈయన 13 ఏళ్లకే రంగస్థల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన .. మరో ఎస్వీ రంగారావు వంటి గొప్ప నటుడు అవుతాడు భావించి ‘ముత్యాల పల్లకి’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు నిర్మాత ఎం.ఎస్.రెడ్డి.
1976 లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈయనకి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ప్రేమించుకుందాం రా’ . 1997 లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. అంటే సినిమాల్లోకి అడుగుపెట్టిన 21 ఏళ్ల తర్వాత ఈయనకి బ్రేక్ వచ్చిందన్న మాట. ‘ప్రేమించుకుందాం రా’ (Preminchukundam Raa) సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) ‘బావగారు బాగున్నారా’ (Bavagaru Bagunnara?) ‘జయం మనదేరా’ (Jayam Manadera) ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) వంటి సినిమాల్లో విలన్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఈయనకి.
అయితే సీరియస్ విలన్ పాత్రలు తప్ప జయప్రకాశ్ ఇంకేమీ చేయలేరా అనుకున్నప్పుడు … ‘ఆనందం’ ‘సొంతం’ సినిమాలతో అతనిలోని కామెడీ యాంగిల్ ని బయటికి తీశాడు దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) . అప్పటివరకు ప్రేక్షకులు చూసిన కామెడీ వేరు..! విలన్ మనిషిగా ఉంటూనే.. ఆ గ్యాంగ్ తో కామెడీ చేయించొచ్చు అని జయప్రకాశ్ రెడ్డి ద్వారా చాలా మంది దర్శకులకి తెలిసొచ్చింది. జయప్రకాశ్ రెడ్డి వాయిస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్ట్ ..లు ఈయన వాయిస్ ని ఇమిటేట్ చేయడం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈరోజు జయప్రకాష్ రెడ్డి గారి జయంతి. 2020 కోవిడ్ టైంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లినప్పటికీ.. జయప్రకాశ్ రెడ్డి పోషించిన ఎన్నో పాత్రలు ఆయన్ని గుర్తుచేసుకునేలా చేస్తున్నాయి అని చెప్పవచ్చు.