‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ 3 ఏళ్ళ తరువాత వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ.. దానిని పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యింది. అటు కరోనా సెకండ్ వేవ్ కు ఇటు ఏపీ పాలిటిక్స్ కు మధ్య ఈ చిత్రం నలిగిపోయింది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించగా నివేదా థామస్,అనన్య, అంజలి వంటి భామలు కీలక పాత్రలు పోషించారు.
ఇక ‘వకీల్ సాబ్’ 16 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం
24.43 cr
సీడెడ్
12.89 cr
ఉత్తరాంధ్ర
11.83 cr
ఈస్ట్
6.21 cr
వెస్ట్
7.26 cr
గుంటూరు
7.11 cr
కృష్ణా
4.94 cr
నెల్లూరు
3.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
78.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
3.58 cr
ఓవర్సీస్
3.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
85.45 cr
‘వకీల్ సాబ్’ చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.16 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 85.45 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 5.05 కోట్ల షేర్ ను రాబట్టాలి.