లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకునే ప్రమాదం ఉంది మరి
- March 6, 2019 / 06:00 PM ISTByFilmy Focus
ఈమధ్యకాలంలో స్టార్ హీరోలు నటించే సినిమాలకు హీరోయిన్ పాత్రల పేర్లను టైటిల్ గా పెట్టడం అనేది కామన్ అయిపోయింది. ముఖ్యంగా.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి “అరవింద సమేత వీరరాఘవ” అనే టైటిల్ ఫిక్స్ అవ్వడం, మహేష్ బాబు-వెంకటేష్ నటించిన సినిమాకి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టడంతో అందరూ ఆ ఆనవాయిటీని ఫాలో అవ్వడం మొదలెట్టారు. తాజాగా దిల్ రాజు “జానకీ దేవి” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. తమిళ సినిమా “96”కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రానికి ఆ టైటిల్ చేయించాడని తెలుస్తోంది.
- 118 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- విశ్వాసం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి “జానకీ దేవి” అనే టైటిల్ పెట్టడం వల్ల ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకునే ప్రమాదం ఉన్నప్పటికీ.. సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఆ టైటిల్ పర్ఫెక్ట్ అని తమిళ వెర్షన్ చూసినవాళ్ళందరూ చెబుతున్నారు.












