ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్న సినిమా సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాను కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ సినిమాని 10 మిలియన్ డాలర్స్ కి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. వాస్తవానికి అన్ని అనుకున్నట్లు జరిగుంటే ఈ నెల 28న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిఉండేది. కొన్ని సన్నివేశాల అవుట్ పుట్ సరిగా రాలేదని, మళ్లీ రీ షూట్ చెయ్యాల్సి రావడంతో సినిమా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మోకాలి సర్జరీ చేయించుకున్న కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ సీన్ల రీషూట్ కోసం ఆయన కోలుకునే వరకు ఆగాల్సిందే.
ఇది ఇలా ఉంటే బయ్యర్లు ఇప్పుడు సలార్ నిర్మాతలకు కొత్త టెన్షన్ తీసుకువచ్చి పెట్టారు. ఈ చిత్రానికి ముందు అనుకున్న డబ్బులు ఇవ్వబోమని తగ్గించి ఇవ్వాలని నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. వాళ్లు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా బయ్యర్స్ ససేమీరా అంటున్నారు.ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలంటూ నిర్మాతలను బయ్యర్స్ డిమాండ్ చేస్తున్నారట. ఎందుకంటే ఆ సీజన్ లో సినిమా ఎలా ఉన్నా వసూళ్లు వస్తాయి కాబట్టి. కానీ ఓవర్సీస్ బయ్యర్స్ దానికి ఒప్పుకోవడం లేదు.
బాలీవుడ్ క్రేజీ మూవీస్ తో పాటు హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కాబట్టి బ్రేక్ ఈవెన్ కి కావాల్సినంత థియేటర్స్ ఆ టైంలో దొరకవు. ఇలాంటి టైంలో నిర్మాతలు మార్చి 22న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమా ఏపీ, తెలంగాణ హక్కులు రూ.160 కోట్లు పలికింది. మార్చి 22న వస్తే మాత్రం రూ.120 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారట. చూడాలి ఏం జరుగుతుందో.