మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘కొండవీటి రాజా’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది.విజయశాంతి,రాధా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉంటుంది.ఇందులో హీరో మెగాస్టార్ చిరంజీవి… స్మిత, జయమాలిని, అనురాధలతో కలసి స్టెప్పులు వేశారు.ఈ పాట ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. దర్శకుడి పనితనానికి అందరూ ప్రశంసలు కురిపించారు. కానీ ఈ పాట వెనుక పెద్ద కథే నడిచింది. మొదట ఈ పాటని ఒక్క సిల్క్ స్మిత తోనే చేయాలి అనుకుని పని షూటింగ్ మొదలుపెట్టారు. ఇందుకోసం రూ.5 లక్షల బడ్జెట్ పెట్టి ఓ భారీ సెట్ వేశారు. ఆరోజుల్లో సిల్క్ స్మిత చాలా బిజీ ఆర్టిస్ట్.
అందుకే ఈ పాట కోసం ఆమె కాల్ షీట్లు 4 నెలల ముందే తీసుకున్నారు నిర్మాత దేవి వర ప్రసాద్.రూ. 25 వేలు పారితోషికం కూడా ఇచ్చారు. అంతేకాదు కాస్ట్యూమ్స్ కోసం మరో రూ.20 వేలు కూడా ఇచ్చారు. అనుకున్న టైంకి ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టారు. షూటింగ్ మొదటి రోజున స్మిత సెట్‌లోకి అడుగుపెట్టింది. ఆమె జుట్టు కూడా దువ్వుకోకుండా చింపిరి జుట్టుతో సెట్‌లోకి వచ్చేసింది.అందుకు రాఘవేంద్రరావు గారు ‘హెయిర్ స్టయిల్ బాగొలేదనీ.. మార్చమని’ కోరారు.అందుకు స్మిత ఆయన మాటని లెక్క చేయలేదు.. ఆయనతో వాదనకి కూడా దిగింది. రాఘవేంద్రరావు ఈ విషయాన్ని లైట్ తీసుకుని షాట్ కు రెడీ అయిపోయారు. పాటలోని కొంత భాగాన్ని పొగమంచు వాతావరణంలో చిత్రీకరించాలని దర్శకుడు భావించారు.
అయితే పొగ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తూ ఫ్యాన్ పెట్టుకుంది స్మిత. నిర్మాత దేవీ వరప్రసాద్ గారు స్మిత ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నారు. షూటింగ్‌కు ఇబ్బంది కాకూడదని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. మొత్తానికి మొదటి రోజు చిత్రీకరణ పూర్తి చేశారు. రెండో రోజున కూడా స్మిత ప్రవర్తన అలాగే ఉంది. నిజానికి సెట్‌లో ఉన్నప్పుడే దర్శకుడి దగ్గరికి వచ్చి నటీనటులు, సాంకేతిక నిపుణులు మాట్లాడుతుంటారు. అయితే స్మిత మాత్రం దర్శకుడు రాఘవేంద్రరావు గారినే తన వద్దకి వచ్చి మాట్లాడాలని ఆర్డర్ వేశారు. దీంతో నిర్మాత దేవీ వరప్రసాద్ గారికి కోపం వచ్చింది. దర్శకుడితో మాట్లాడి స్మితని ఆ సినిమా నుండీ తొలగించారు. ఆల్రెడీ కొంత భాగాన్ని స్మిత పై చిత్రీకరించారు కాబట్టి… మిగిలిన పాటని జయమాలిని,అనురాధ లతో చిత్రీకరించి ఆ పాటని పూర్తి చేశారు.స్మిత వల్ల ఏర్పడిన లోపాన్ని అలా మేనేజ్ చేశారన్న మాట.