కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా ప్రస్తుతం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని అన్ని భాషలలో విపరీతమైన ఆదరణ పొందుతుంది. ఇక ఈ సినిమా అన్ని భాషలలో కూడా భారీ కలెక్షన్లను రాబడుతుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కర్ణాటక తుళునాడులోని కోలా, కంబా సంప్రదాయ ఆచారాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.
కాంతార సినిమా ద్వారా భూతకోల సంస్కృతిని తెలియజేశారు. ఇక ఈ సినిమాకు అన్ని భాషలలో మంచి ఆదరణ రావడంతో చిత్ర బృందం సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ.. అంటూ వింత శబ్దాన్ని చేస్తారని చూపించారు. ఈ క్రమంలోనే ఈ శబ్దం వచ్చినప్పుడు థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకులకు కూడా పెద్ద ఎత్తున ఆ శబ్దాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై దర్శకుడు రిషబ్ శెట్టి స్పందిస్తూ అభిమానులకు విన్నపం చేశారు.
దయచేసి ఎవరూ కూడా ఈ శబ్దాన్ని చేయకండి. ఇది కేవలం శబ్దం మాత్రమే కాదు..ఇదొక ఆచారం. ఆధ్యాత్మిక నమ్మంక. అలాగే ఇది చాలా సున్నితమైన అంశం ఇలా బయట ఈ శబ్దం చేయటం వల్ల ఆచారం దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇది మా సెంటిమెంట్ దయచేసి ఎవరూ కూడా ఈ శబ్దాన్ని చేయకండి అంటూ ఈయన ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేశారు.
ఇలా ఆచార సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు రిషబ్ శెట్టి కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుందని వెల్లడించారు. ఈ సినిమాపై ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై స్పందిస్తూ పెద్ద ఎత్తున చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.