సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. అవకాశాలు వచ్చినప్పటికీ సరైన పాత్రలు పడితేనే వారికి భవిష్యత్తు ఉంటుంది.లేదా సరైన పాత్ర పడితేనే గుర్తింపు లభిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘దర్శకనిర్మాతలు ఎక్కువగా తమ సినిమాల్లో నార్త్ బ్యూటీలకే అవకాశాలు ఇస్తారు… తెలుగమ్మాయిలను పట్టించుకోరు’ అని చాలా మంది ఆరోపణలు చేస్తుంటారు. అది వట్టి అపోహే.! ట్యాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలకు మంచి అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి.
అందుకు చాలా మంది ఎగ్జాంపుల్ గా నిలిచారు. అందులో తెలుగమ్మాయి అక్షరని కూడా చెప్పుకోవచ్చు. నటన పట్ల ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టింది. మొదటగా కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ‘ఎంత మంచివడవురా’ సినిమాలో పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఆ తర్వాత రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన ‘రెడ్’ మూవీలో ఇన్స్పెక్టర్ సంపత్ కూతురి పాత్ర పోషించింది. అయితే అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈ చిత్రంలో వదిన పాత్రలో నటించింది. ‘పుష్ప పార్ట్ 2’ లో కూడా అక్షర పాత్ర నిడివి పెంచుతున్నారట. ‘పుష్ప’ హిట్ అవ్వడంతో ఈమెకు రవితేజ- సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రావణాసుర’ చిత్రంలో కూడా అవకాశం లభించింది. ఈ మూవీలో కూడా ఆమెది చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడమే తన ముఖ్య ఉద్దేశం, లక్ష్యం అని చెబుతుంది ఈ అమ్మడు.