అక్కేనేని వారసుడు.. టాలీవుడ్ మన్మధుడు.. కింగ్ నాగార్జున. సినిమారంగంలో అడుగు పెట్టి ముప్పై ఏళ్ళు అవుతున్నా.. తన వారసులు పెళ్లీడు కొచ్చినా ఇంకా కుర్రోడిగా కనిపించడం నాగ్ కు మాత్రమే సాధ్య మైంది. నయా స్టైల్స్ ని ఫాలో అవడంలో.. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందు ఉండే బంగార్రాజు గురించి స్పెషల్ ఫోకస్.
అన్న స్టైలే మాస్
తెలుగు సినీ పరిశ్రమలో హెయిర్ స్టైల్స్ ఫై నాగార్జున చేసిన ప్రయోగాలు ఎవరూ చేయలేదు. గగనం, శివమణి వంటి పోలీస్ అధికారి గా చేసినప్పుడు మాత్రమే అతని హెయిర్ స్టైల్ ఒద్దికగా ఉంటుంది. మిగిలిన చిత్రాల్లో స్టైల్ కే నిర్వచనం చెబుతాయి.శివ సినిమాలో విద్యార్ధిగా కనిపించిన లుక్ లో హెయిర్ స్టైల్ దే ప్రధాన ఆకర్షణ. వెనక్కి దువ్వినా పక్కన వాలి పోయే ఆ స్టైల్ అప్పటి కుర్రాళ్ళకు తెగ నచ్చేసింది. అప్పటినుచి ఇప్పటి వరకు ఒక్కో సినిమాలో ఒక్కో స్టైల్ తో కనిపిస్తున్నారు.సూపర్ సినిమాలో భుజాల మీదకు పడిపోయే హెయిర్ స్టైల్ తో కేక పుట్టించారు. తర్వాత డాన్ మూవీలో బలంగా వెనక్కి దువ్వి క్లిప్ వేస్తాడు. ఈ హెయిర్ స్టైల్ ను రఫ్ బాయ్స్ ఫాలో అయిపోయారు. భాయ్ చిత్రంలో అయితే హెయిర్ ని షార్ట్ చేసి ఫ్రెంచ్ గడ్డం పెంచి యువకుడిలా అదరగొట్టారు. లేటస్ట్ గా వచ్చిన సోగ్గాడి చిన్ని నాయన లో బంగార్రాజు పాత్రకి అలనాటి అల్లరి అల్లుడు సినిమాలోని మాస్ హెయిర్ స్టైల్ తో మెస్మరైజ్ చేశారు. అప్పటికి ఇప్పటికి హెయిర్ స్టైల్ లో నాగార్జున కింగ్.
విభిన్న పాత్రల్లో..
కొందరు కొన్నిపాత్రలకు మాత్రమే సరిపోతారు. వేరే పాత్రల్లో వారిని చూడలేము.. అనే మాటను నాగ్ అటకె క్కించారు. నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, నిన్నే పెళ్ళాడతా వంటి లవ్ స్టోరీలు చేస్తున్న సమయంలోనే “అన్నమయ్య” భక్తి రస చిత్రం లో నటించి హిట్ సాధించారు. చంద్ర లేఖ, హలో బ్రదర్ లో కామెడీ పండించారు. మాస్, రగడ లో పైట్ లతో అదరగొట్టారు. రాజన్నలో స్వంతంత్ర పోరాట యోధుడిగా మెప్పించారు. ఇలా అన్నీజాన్రలో హిట్ సాధించిన ఏకైక హీరో గ్రీకు వీరుడు నాగ్.
ప్రతిభ కు ప్రోత్సాహం:నాగార్జున ఎంత ఎత్తుకు ఎదుగుతున్న కిందికే చూస్తుంటారు. కొత్త డైరక్టర్లకు అవకాశం ఇస్తుంటారు. అప్పుడు శివ ద్వారా రామ్ గోపాల్ వర్మని డైరక్టర్ పరిచయం చేస్తే, మొన్న సోగ్గాడే చిన్ని నాయనా తో కళ్యాణ్ కృష్ణ ని దర్శకుడు గా పరిచయం చేసారు. ఇలా కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేయడానికి ఎప్పటికి వెనకడుగు వేయరు. ప్రేమకథ, ఉయ్యాలా జంపాలా తదితర సినిమాలకు నిర్మాతగా ఉండి కొత్త కథలకు రూపం ఇస్తున్నారు.
నైపుణ్యానికి పదును: సినిమాకి సంబంధించిన డిగ్రీ కోర్సులు చేయాలంటే ఇది వరకు పూణే, ముంబై, చెన్నైకి వెళ్ళాల్సి వచ్చేది. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను తీసే పరిశ్రమగా పేరున్న మనకి ప్రత్యేకమైన ఫిల్మ్ స్కూల్ లేదు. ఆ లోటుని తీర్చాలనే సంకల్పంతో అక్కినేని నాగేశ్వర రావు సూచనలు, సలహాలతో నాగార్జున “అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా”ను స్థాపించారు. చిత్ర నిర్మాణ రంగంలో అనుభవం కలిగిన వారితో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగినట్లుగా కోర్సులు డిజైన్ చేయించారు. ఇక్కడ చదివే వారికి థియరీ లెసన్స్ తో పాటు ప్రాక్టికల్ గా నేర్చుకునేందుకు సినిమా రియల్ ప్రాజక్ట్ లో స్టూడెంట్స్ ను ఇన్వాల్వ్ చేయించడం ఈ స్కూల్ ప్రత్యేకత. తెలుగు చిత్ర పరిశ్రమకు నైపుణ్యం కలిగిన టెక్నిషియన్లను అందించాలన్నేదే ఈ స్కూల్ స్థాపించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని కింగ్ నాగార్జున పలు మార్లు చెప్పారు. లాభాపేక్ష లేకుండా పనులు చేయడంలో నాగ్ ఎల్లప్పుడూ ముందుంటారని ఈ స్కూల్ మరో సారి నిరూపించింది.వెలుగులు నింపిన ఎంఈకే:వెండితెరఫై విజయాలను సాధిస్తూనే బుల్లితెరలోకి అడుగు పెట్టాడు కింగ్ నాగార్జున. మీలో ఎవరు కోటీశ్వరుడు (ఎంఈకే) షోతో సంచలనం సృష్టించాడు. హింది షో కౌన్ బనేగా కరోడ్పతి షో కు ధీటుగా రెస్పాన్స్ వచ్చింది.ఎక్కడో మారుమూల పల్లెటూరిలో ఉన్నసామాన్యుడు తన కలల్నీ నిజం చేసుకునే అద్భుత అవకాశం కల్పించిన వేదికలో నాగ్ తనో పేద స్టార్ లా కాకుండా ఫ్రెండ్ గా పార్టి సిపెంట్ లతో కలిసిపోయాడు. తనకే సొంతమైన మాటలతో టీవీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. సామాన్యులకు సింహాసనం వేసిన ఈ షోలోని ప్రతి ఎపిసోడ్ దేనికదే ప్రత్యేకం. ఈ షో పార్టిసిపెంట్ లకు, నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఎంఈకే ప్రేక్షకాదరణ పొందడంతో మూడు సీజన్లు గా వచ్చింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. మీలో ఎవరు కోటీశ్వరుడు మూడవ సీజన్ నిన్నటి (మే 22) తో ముగియనుంది.