టాలీవుడ్ లో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. తెలుగుతో పాటు మలయాళంలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో డబ్ కావడంతో పాటు యూట్యూబ్ లో, టీఆర్పీ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. బన్నీ డబ్బింగ్ సినిమాలకు అక్కడి స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ పేరిట కొన్ని రికార్డులు ఉండగా తాజాగా అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ కూడా డబ్బింగ్ సినిమాలతో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు.
బన్నీ నటించిన సరైనోడు, శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాలు గత వారం అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాలుగా నిలవడం గమనార్హం. టాలీవుడ్ లో ఏ బ్రదర్స్ కు లేని అరుదైన రికార్డ్ అల్లు బ్రదర్స్ సొంతమైంది. ఈ రెండు సినిమాలకు ఏకంగా 4863, 4016 యావరేజ్ మినిట్ ఆడియన్స్ తో రికార్డులు నమోదయ్యాయి. గత వారం ఈ సినిమాలతో పాటు బాహుబలి కూడా ప్రసారం కాగా ఆ సినిమాకు మాత్రం కేవలం 3609 యావరేజ్ మినిట్ ఆడియన్స్ నమోదు కావడం గమనార్హం.
అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా హిందీలో టీవీలో ప్రసారమై అంచనాలను మించి సక్సెస్ కావడం గమనార్హం. ఏబీసీడీ సినిమాకు రికార్డు స్థాయిలో రేటింగ్స్ రావడంపై అల్లు శిరీష్ స్పందిస్తూ హిందీ ప్రేక్షకులు ఏబీసీడీ సినిమాపై చూపించిన ప్రేమను, అభిమానాన్ని మాటల్లో చెప్పలేనని తెలిపారు. సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ వల్ల వాళ్లు అంతలా ఏబీసీడీ సినిమాకు కనెక్ట్ అయ్యారని.. నటుడిగా ప్రేక్షకులను అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని శిరీష్ తెలిపారు. భారీ రేటింగ్స్ తో అల్లు బ్రదర్స్ టాలీవుడ్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చారనే చెప్పాలి.