‘ఆహా’ ఓటిటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. కరోనా కారణంగా లాక్ డౌన్ పడడానికి కొద్దిరోజుల ముందు ‘ఆహా’ ని లాంచ్ చేసారు అల్లు అరవింద్ గారు. తక్కువ కంటెంట్ తో ప్రారంభమైనప్పటికీ ‘ఆహా’ ని తెలుగు ప్రేక్షకులు త్వరగానే ఓన్ చేసుకున్నారు. తమిళ్, మలయాళం భాషల్లో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలని డబ్ చేసి ప్రేక్షకులను బాగా ఆకర్షించారు. తెలుగు కంటెంట్ కు కూడా ‘ఆహా’ పెద్ద పీట వేస్తుంది.
కొన్ని చిన్న సినిమాలని అలాగే వెబ్ మూవీస్ ను ‘ఆహా’ విడుదల చేస్తూ ఎంతో మంది క్రియేటర్స్ ను ఎంకరేజ్ చేస్తుంది. మొదట్లో విజయ్ దేవరకొండ ‘ఆహా’ ని ప్రమోట్ చేసాడు. తర్వాత అల్లు అర్జున్ కు దీనిని హ్యాండోవర్ చేశారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ‘ఆహా’ తో నాకు సంబంధం లేదు అన్నట్టు అల్లు శిరీష్ వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాశం అయ్యింది. ‘డియర్ ఆహా వీడియోస్ టీం… చాలా మంది నేను ‘ఆహా’ బిజినెస్ లో మెంబర్ అనుకొని..
వాళ్ళు ఈ యాప్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యల గురించి నన్ను ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. దయచేసి.. వారి సమస్యలను పరిష్కరించండి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అల్లు ఫ్యామిలీ మెంబర్ అయిన శిరీష్ ఇలా ట్వీట్ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఓ విధంగా అతను చెప్పింది నిజమే. ‘ఆహా’ లో పెట్టుబడులు పుట్టినవాళ్ళు ఇంకా ఉన్నారు. దిల్ రాజు ఫ్యామిలీ, ‘మై హోమ్’ అధినేతలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. కాబట్టి… అల్లు శిరీష్ చేతిలో ఏమీ ఉండదు. ‘ఆహా’ టెక్నికల్ టీం మాత్రమే వీటిని సాల్వ్ చేయగలరు.
Dear @ahavideoIN, lots of ppl tagging me thinking I’m involved with Aha. Kindly address the customer complaints. https://t.co/xbt4xkdfhr