సినిమా రంగంలో అతి తక్కువ సమయంలోనే ప్రతిభని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో నిర్ణయాలు కూడా అంతేవేగంగా తీసుకోవాలి. మంచి కథని ఎన్నుకోవడంలోనే సగం విజయం దాగుంది. కానీ అను ఇమ్యానుయేల్ మంచి కథ అనుకున్నవి ప్లాప్ అవుతున్నాయి.. ఆమెకి సో సో అనిపించిన కథలు బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తున్నాయి. తాజాగా మంచి కథని మిస్ చేసుకుంది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందంలో హీరోయిన్ గా నటించమని మొదట అను ఇమ్యానుయేల్ ని అడిగారు. కానీ ఆమె నో చెప్పింది. అందుగల కారణాన్ని ఈరోజు వెల్లడించింది. ఆమె నటించిన “శైలజా రెడ్డి అల్లుడు” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె ‘గీత గోవిందం’ గురించి ప్రస్తావించింది. “ముందుగా గీతగోవిందం సినిమాలో హీరోయిన్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది.
అయితే అప్పటికే నేను “నా పేరు సూర్య” సినిమాతో బిజీగా వున్నాను. ఇక ‘శైలాజా రెడ్డి అల్లుడు’ కూడా ఒప్పుకుని ఉన్నాను. అందువల్లనే ‘గీత గోవిందం’ చేయలేకపోయాను. ఈ సినిమాను నేను ఇంకా చూడలేదు .. కానీ ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించిందనేది చూస్తూనే ఉన్నాను. ఈ సినిమా హిట్ అయినందుకు ఆనందంగా వుంది .. హీరోయిన్ గా నేను చేయలేకపోయానే అనే బాధ కూడా ఉంది” అని చెప్పింది. అను గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమా సామాన్యులతో పాటు సెలబ్రిటీల మనసును గెలుచుకుంది. వందకోట్ల కలక్షన్స్ కొల్లగొట్టి దూసుకుపోయింది. ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. అను చేసి ఉంటే ఆమె బిజీ హీరోయిన్ అయిపోయేది.