వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. ‘అరుంధతి’ సినిమాలో జేజెమ్మ పాత్రకు అనుష్క వందకు వంద శాతం న్యాయం చేసింది… అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ పాత్రని ముందుగా ఇద్దరు రిజెక్ట్ చేస్తే.. ఆ తరువాత అనుష్క వద్దకు వచ్చిందట. ‘అరుంధతి’ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన వారిద్దరిలో.. మొదటి వ్యక్తి ఒకరు మంచు లక్ష్మీ. అవును మొదట జేజెమ్మ పాత్రను కోడి రామకృష్ణ.. లక్ష్మీకే వినిపించాడట. కానీ అప్పటికే మంచు లక్ష్మీ ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాకి కమిట్ అయ్యిందట.
ఆ చిత్రంలో ఐరేంద్రి పాత్ర కోసం ‘అరుంధతి’ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట మంచు లక్ష్మీ. అయితే ‘అనగనగా ఓ థీరుడు’ చిత్రంలో లక్ష్మీ పాత్రకు అలాగే ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. నంది అవార్డు కూడా అందుకుంది. ఇక మంచు లక్ష్మీ రిజెక్ట్ చేసిన తర్వాత.. సింగర్ కమ్ హీరోయిన్ అయిన మమతా మోహన్ దాస్ కు ‘అరుంధతి’ కథని వినిపించాడట దర్శకుడు కోడి రామకృష్ణ. అయితే ఆ సమయంలో మమత ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో.. కథ నచ్చినా ఆమె చెయ్యలేకపోయిందట.
దీంతో అనుష్క ను తీసుకున్నాడు కోడి రామకృష్ణ. ఈమె పొడుగ్గా ఉంటుంది కాబట్టి.. ఆ పాత్రకు మరింత ఆకర్షణ చేకూరింది. కేరళ డిజైనర్ తో అనుష్కకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించాడట దర్శకుడు కోడి రామకృష్ణ. దానికి 4 నెలలు టైం పట్టిందట. ఇక 2009 జనవరి 16 న విడుదలైన ‘అరుంధతి’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది… అనుష్క ను స్టార్ హీరోయిన్ ను చేసింది. అప్పటి నుండీ అనుష్క వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.