గత కొంతకాలంగా ఏపీలో టికెట్ రేట్ల గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గినా థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడానికి అసలు కారణం ఇదేనని సమాచారం. ఈ సమస్య వల్లే మిడిల్ రేంజ్ హీరోల సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాల రిలీజ్ డేట్లు సైతం వాయిదా పడుతున్నాయి. అయితే తాజాగా సీఎం జగన్ ఏపీ సినీ ప్రముఖులకు అపాయింట్ మెంట్ ఇచ్చారని సమాచారం.
చిరంజీవితో పాటు కొరటాల శివ మరి కొందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం జగన్ టికెట్ రేట్ల విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఓటీటీలు, వెబ్ సిరీస్ ల వల్ల థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్లు పెరగకుండా సినిమాలను రిలీజ్ చేస్తే నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
అయితే సీఎం జగన్ టికెట్ రేట్ల పెంపుకు అంగీకరించకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. టికెట్ రేట్లు పెరగని పక్షంలో సినిమాలకు హిట్ టాక్ వచ్చినా సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే లేవని చెప్పవచ్చు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లు ఎంతమేర పెరుగుతాయో చూడాల్సి ఉంది. వకీల్ సాబ్ కు ముందు అమలులో ఉన్న టికెట్ రేట్లనే ఇప్పుడు కూడా అమలు చేస్తే మంచిదని థియేటర్ల ఓనర్లు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి టికెట్ రేట్ల సమస్యకు చెక్ పెడతారో లేదో చూడాల్సి ఉంది.