దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెరపై చెక్కిన శిల్పం బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా 13,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజు దేశవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకో రికార్డు చొప్పున బద్దలు కొడుతోంది. రెండు రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా 1076 స్క్రీన్లలో అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని మరే భారతీయ చిత్రానికి సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.
కేవలం ఇండియాలోనే 1050 థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 1,708 కోట్లను వసూలు చేసి తెలుగు వారి సత్తాని చాటింది. దేశవ్యాప్తంగా 1366 కోట్లు కొల్లగొట్టగా ఓవర్సీస్ లో 342 కోట్లు రాబట్టింది. చైనాలో సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న మూవీ అక్కడ మూడు వందల కోట్లను సులువుగా వసూలు చేసి 2000 కోట్ల మెయిలు రాయిని చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.