బాహుబలి బిగింగ్ కి వచ్చిన రెస్పాన్స్ తో బాహుబలి కంక్లూజన్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో నిర్మాతలు 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి లాభాలను అందుకున్నారు. బాహుబలి 2 ఏరియా హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ లో మాత్రం ఏదో మూల భయం వెంటాడుతూనే ఉన్నింది. కొన్న మొత్తం తిరిగి వస్తుందా? అని సందేహించారు. ఆ అనుమానాలు అన్నీ తొలిరోజే పటాపంచలు చేసింది. కొన్ని ఏరియాల్లో ఒక వారంలోనే డిస్ట్రిబ్యూటర్స్ కి కొన్న మొత్తం వెనక్కి వచ్చింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు రెండు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యారు బాహుబలి-2 తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల మేర కొన్నారు. ఆ లెక్కన 150 దగ్గరగా వస్తే తప్ప, గట్టెక్కలేరని భయపెట్టిన వారంతా కలక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. పన్నెండు రోజుల్లోనే తెలుగురాష్ట్రాల్లో 151.36 కోట్లు షేర్ రాబట్టి లాభాలను అందివ్వడం మొదలు పెట్టింది. ఇప్పటికీ థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతుండడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువలాభాలను చూడనున్నారు. పన్నెండు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో కలక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్లు
నైజాం : 50.10 కోట్లు
సీడెడ్ : 26.37 కోట్లు
ఉత్తరాంధ్ర : 19.92 కోట్లు
ఈస్ట్ : 14.06 కోట్లు
వెస్ట్ : 10.34కోట్లు
క్రిష్ణా : 10.72 కోట్లు
గుంటూరు : 14.20కోట్లు
నెల్లూరు : 5.65 కోట్లు మొత్తం 151.36 కోట్లు
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.