Bandla Ganesh: ఆ దర్శకుడిని మళ్లీ టార్గెట్ చేసిన బండ్ల గణేష్.. షాకింగ్ ట్వీట్ తో?
- May 26, 2023 / 04:47 PM ISTByFilmy Focus
కొన్నేళ్ల క్రితం వరకు నిర్మాతగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న బండ్ల గణేష్ ఎవరూ ఊహించని విధంగా సినీ నిర్మాణానికి గుడ్ బై చెప్పారు. టెంపర్ సినిమాతో కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకున్న బండ్ల గణేష్ ఆ సినిమా తర్వాత సినిమాల నిర్మాణానికి గుడ్ బై చెప్పడం గమనార్హం. అయితే కొన్నిరోజుల క్రితం రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని చెప్పిన బండ్ల గణేష్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కు (Bandla Ganesh) బండ్ల గణేష్ కు మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీలో చాలా సందర్భాల్లో ప్రచారం జరిగింది. బండ్ల గణేష్ సైతం పలు సందర్భాల్లో ప్రచారాన్ని అంగీకరించారు. పవన్ కు బండ్ల గణేష్ కు మధ్య కొంతమేర దూరం పెరగడానికి త్రివిక్రమ్ కారణమని కూడా ప్రచారం జరిగింది. అయితే త్రివిక్రమ్ కు సన్నిహితులైన దర్శకులకు, నిర్మాతలకు ప్రస్తుతం పవన్ సినిమాలకు పని చేసే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చాలా సినిమాలలో త్రివిక్రమ్ జోక్యం ఉంది.

తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తనకు నిర్మాత కావాలని ఉందని బండ్ల గణేష్ ను అడిగారు. “గురూజీని కలవండి.. భారీ గిఫ్ట్ ఇవ్వండి.. మీ కోరిక నెరవేరుతుంది” అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ గురించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. బండ్ల గణేష్ మరోసారి తన ట్వీట్ ద్వారా వార్తల్లో నిలిచారు. భార్యా భర్తలను, గురు శిష్యులను, తండ్రీ కొడుకులను గురూజీ వేరు చేస్తాడని అదే గురూజీ స్పెషాలిటీ అని మరో ట్వీట్ లో బండ్ల గణేష్ పేర్కొన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్, సాయితేజ్ హీరోలుగా తెరకెక్కిన వినోదాయ సిత్తం రీమేక్ కు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. జులై నెల 28వ తేదీన రికార్డ్ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజయ్యేలా పవన్ ప్లానింగ్ ఉంది. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
Meet Guruji & give costly gift it will happen https://t.co/BdvLvTwbbs
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023
అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ https://t.co/P6J844y0fa
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు












