పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత సంక్రాంతికి రావల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు అని నిర్మాత చాలా బలంగా ఫిబ్రవరి 25వ తేదీ ఫిక్స్ చేసుకున్నాడు. మధ్యలో సినిమా వాయిదా పడుతుంది అనే చాలా రకాల వార్తలు వచ్చినప్పటికీ ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అందులో ఏది నిజం అనే వివరాల్లోకి వెళితే.. భీమ్లా నాయక్ తెలుగు ఓటీటీ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ను హాట్ స్టార్ డిస్నీ ప్లస్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ రెండు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో లో కూడా ఒకేసారి భీమ్లా నాయక్ సందడి చేయబోతున్నట్లు సమాచారం. సినిమా థియేటర్స్ లోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతల్లో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే మార్చి నాలుగో వారంలో భీమ్లా నాయక్ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 120 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్లోకి దిగుతోంది.
మొదటి రోజే సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. ఇక ఓటీటీ శాటిలైట్ ద్వారా సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించనుట్లు సమాచారం. ఇక ఆ రూట్లోనే పెట్టిన పెట్టుబడి దాదాపు సగానికి పైగా రికవరీ అయినట్లు సమాచారం. నాన్ థియేట్రికల్ గా మొత్తం గా భీమ్లా నాయక్ 70 కోట్లకుపైగా లాభాలను అందించినట్లు తెలుస్తోంది.