‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు.
మార్చి 1న ఈ చిత్రం (Bhoothaddam Bhaskar Narayana) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఆల్రెడీ నిన్న రామానాయుడు స్టూడియోస్ లో కొంతమంది పెద్దలకి ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన ప్రేక్షకులు.. పర్వాలేదు అనే టాక్ చెబుతున్నారు. కాన్సెప్ట్ బాగుందట. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినా యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నట్లు వినికిడి. తలలు లేకుండా స్త్రీల డెడ్ బాడీస్ ను చూపించే విజువల్స్ ను నేచురల్ గా, భయపెట్టే విధంగా చిత్రీకరించారని అంటున్నారు.
సెకండ్ హాఫ్ ప్రేక్షకులను ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందట. హీరో శివ కందుకూరి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడట. డిటెక్టివ్ గా తన బాడీ లాంగ్వేజ్.. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూసిన దానికి డిఫరెంట్ గా ఉంటుందట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం డివోషనల్ ఫీల్ తో పాటు హార్రర్ ఫీల్ కూడా కలిగించింది అని అంటున్నారు. ఒకసారి చూసే డీసెంట్ థ్రిల్లర్ మూవీ ఇది అని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. మరి ప్రీమియర్స్ తో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి