దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్కెట్ రేంజ్ ను పెంచడానికి అన్ని భాషలకు సంబంధించిన ఆర్టిస్ట్ లను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, అలియా భట్ లాంటి స్టార్లను రంగంలోకి దించారు. క్యారెక్టర్స్ డిమాండ్ చేయడం వలనే వాళ్లను తీసుకున్నట్లు గతంలో వెల్లడించారు రాజమౌళి. కానీ హైప్ కోసం బాలీవుడ్ ఆర్టిస్ట్ లను తీసుకున్నారని అంటుంటారు.
ఈ విషయం పక్కన పెడితే.. ఈ తారలకు అదే రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ ఈ సినిమా కోసమా మొత్తం ఏడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా రూ.35 కోట్లు తీసుకున్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. అంటే రోజుకి ఐదు కోట్లన్నమాట. ఇక అలియా భట్ విషయానికొస్తే.. ఆమెకి రెమ్యునరేషన్ గా రూ.9 కోట్లు ఇచ్చారట. సినిమాలో ఆమె పాత్ర నిడివి 20 నిమిషాలే ఉంటుందని టాక్.
ఇలాంటి క్యామియో రోల్ కి ఏకంగా తొమ్మిది కోట్లు పారితోషికంగా ఇచ్చారు నిర్మాత. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. వాటిలో రెండొందల కోట్లు కేవలం రెమ్యునరేషన్స్ కోసమే అయినట్లు సమాచారం. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన తరువాత కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.