అభిమానాన్ని చూపించడంలో తమిళ జనాలను ఎవరు మించిపోలేదు అంటుంటారు. కానీ తెలుగు ఫ్యాన్స్ అసలైన ప్రేమ ముందు ఎవరు సరి తూగరనే చెప్పవచ్చు. మన స్టార్ హీరోలు ఎక్కడికైనా వస్తున్నారు అనే అనుమానం వస్తే చాలు జనాలు ఏ రేంజ్ లో వస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చరిత్రలోనే ఎవరు కూడా చూడని ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా కనిపించింది. అది ఆడియో ఈవెంట్ కాదు. ఒక చరిత్ర అనే చెప్పాలి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంధ్రావాలా సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆ సినిమా విడుదలకు ముందు క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. సింహాద్రి లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత తారక్ నుంచి వచ్చే సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. సినిమాను 2004 జనవరిన రిలీజ్ చేశారు. ఇక 2003 డిసెంబర్ 5న సినిమా ఆడియో వేడుకను ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో నిర్వహించారు. ఆ వేడుక కోసం ప్రత్యేకంగా 10 రైళ్లను కూడా నడిపించారు.
సినిమా ఆడియో వేడుకకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలువైపుల నుంచి దాదాపు 10లక్షల మంది రావడం చరిత్రలోనే అది మొదటిసారి. ఇప్పటివరకు ఏ సినిమాకు ఆ రేంజ్ లో జనాలు రాలేదు. మళ్ళీ అలాంటి వేడుకను నిర్వహించడం ఎవరికి సాధ్యం కాదు కూడా. ఖైదీ నెంబర్ 150కి 5లక్షల మందికి రాగా బాహుబలికి 3లక్షల మంది వచ్చి ఉండవచ్చని అంచనా. ఇక ఆ రికార్డును బద్దలు కొట్టాలి అంటే మళ్ళీ RRR తోనే సాధ్యం అవుతుంది. కానీ ఆ వేడుకను నిర్వహించాలి అంటే గట్స్ ఉండాలి. రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండవు. మరి దర్శకుడు రాజమౌళి ఆ వేడుకను అసలు నిర్వహిస్తాడా లేక మరేదైనా ప్లాన్ వేస్తాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది.