సినిమా విడుదలకు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ, థియేటర్ల లభ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరూ అనుకొంటారు. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ అనంతరం సెన్సార్ అనేది ఒకటి ఉంటుందనే విషయాన్ని చాలా మంది లైట్ తీసుకొంటారు. మహా అయితే కొన్ని కట్స్ చెబుతారు.. సెన్సార్ ఈజీగానే అయిపోతుంది అనుకునేవాళ్ళు. కానీ.. విచిత్రంగా ఈమధ్య సినిమా పైన పేర్కొన్న అన్నీ విషయాలకంటే సినిమాను సెన్సార్ చేయించడం చాలా కష్టం అయిపోతోంది. గతంలోనూ కొన్ని సినిమాలు సెన్సార్ బోర్డ్ కారణంగా ఇబ్బందులుపడినప్పటికీ.. ప్రస్తుతం దాదాపుగా అన్నీ సినిమాలు సెన్సార్ బోర్డ్ కారణంగా లేనిపోని తలపోట్లు ఎదుర్కొంటుండడం గమనార్హం.
రాంగోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” చిత్రాన్ని సెన్సార్ చేయించడానికి ఎన్ని ఇబ్బందులుపడుతున్నాడో చూస్తూనే ఉన్నారు. ఇక చిన్న చిత్రమైన “90ML” అయితే సెన్సార్ పూర్తవ్వని కారణంగా సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇవాళ విడుదలవ్వాల్సిన “90ML” సెన్సార్ పూర్తవ్వకపోవడంతో రేపటికి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి సెన్సార్ బోర్డ్ మరియు సెన్సార్ ను అంత ఈజీగా తీసుకోకూడదు అని అందరికీ అర్ధమవుతోంది.