మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు చేతిలో మరికొన్ని సినిమాలున్నాయి. ‘లూసిఫర్’ రీమేక్ అలానే ‘వేదాళం’ రీమేక్ లలో నటించనున్నారు. ‘లూసిఫర్’ రీమేక్ కి ఇంకా డైరెక్టర్ సెట్ అవ్వలేదని సమాచారం. ‘వేదాళం’ రీమేక్ ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నారు. ‘ఆచార్య’ పూర్తయిన వెంటనే ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్తారట. ఈ సినిమా కోసం చిరుకి ఏకంగా రూ.60 కోట్లు రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని..
దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా అయిపోయానని ప్రచారం జరిగింది. ‘ఆచార్య’ కోసం చిరు రూ.50 కోట్లకు తీసుకుంటున్నారని.. దానికి మరో పది కోట్లు వేసి ‘వేదాళం’ రీమేక్ కోసం ఇచ్చారనేది వార్త. నిజానికి ఈ సినిమా ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఎవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది ఫిక్స్ అవ్వలేదు. రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవికి, నిర్మాతలకు మధ్య ఎలాంటి చర్చ జరగలేదట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ కి చిరంజీవి సినిమా చేయడం అనేది మాత్రం ఫిక్స్ అయింది.
అంతే తప్ప.. రెమ్యునరేషన్ విషయంలో ఇంకా ఒక నెంబర్ ఫిక్స్ అవ్వలేదట. ఈ విషయాన్ని మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. ‘వేదాళం’ రీమేక్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుంది. అప్పటివరకు చిరు ఫోకస్ మొత్తం ‘ఆచార్య’పైనే ఉంది. ఇది పూర్తయిన తరువాత కానీ ‘వేదాళం’ సినిమాకి సంబంధించిన లెక్కలు బయటరావు.