యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను 130 కోట్ల రూపాయలకు విక్రయించాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ హక్కులు సితార బ్యానర్ సొంతమయ్యాయని 115 నుంచి 125 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ డీల్ ఫైనల్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తలను చాలామంది ఫ్యాన్స్ నిజమేనని నమ్మారు.
సితార నిర్మాత నాగవంశీతో (Suryadevara Naga Vamsi) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ డీల్ నిజం కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేకపోవడంతో నాగవంశీ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్ డేట్స్, ఫోటోలలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని నాగవంశీ పేర్కొన్నారు.
దయచేసి వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. గతేడాది సితార నిర్మాతలు లియో (LEO) సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలను సొంతం చేసుకున్నారు. అయితే లియో ప్రమోషన్స్ సమయంలో ఈ సినిమాను మాత్రమే కొన్ని కారణాల వల్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని సినిమాల డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తామని కచ్చితంగా చెప్పలేమని నాగవంశీ పేర్కొన్నారు.
భవిష్యత్తులో సితార ఎంటర్టైన్మెంట్స్ లేదా హారిక హాసిని బ్యానర్ లో తారక్ నటించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రైట్స్ కోసం ఒకింత గట్టి పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు మైత్రీ నిర్మాతల సొంతమవుతాయో లేక దిల్ రాజు (Dil Raju) సొంతమవుతాయో చూడాలి. ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
There is no truth in the "images" and "updates" being circulated on social media.
Any official update about our Production or Distribution will be announced through us and US, ONLY. Kindly refrain from believing in rumours from any other sources.