మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవితో సమానమైన సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే కచ్చితంగా అలీ అనే చెప్పాలి. అదేం లెక్క అని అడగొచ్చు కానీ.. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఎందుకంటే.. చిరంజీవి ఎంట్రీ 1978లో జరిగితే అలీ ఎంట్రీ 1979లో జరిగింది.. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్నమాట. అందుకే.. బ్రహ్మానందం లాంటి సీనియర్ ఆర్టిస్ట్ కూడా అలీని పట్టుకొని “నువ్ నాకంటే సీనియర్ వి రా” అని అనడానికి రీజన్ అదే.
ఈ ఏడాదితో అలీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లయ్యింది. నలభైవ యానివర్సరీ స్పెషల్ అనుకున్నాడో ఏమో కానీ.. అలీ సడన్ గా బాలీవుడ్ తెరపై మెరిసి ఆశ్చర్యపరిచాడు. నిన్న విడుదలైన “టోటల్ ధమాల్” చిత్రంలో మరీ పెద్ద క్యారెక్టర్ కాకపోయినా చిన్న అతిధి పాత్రలో కాస్త నవ్వించాడు అలీ. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన అలీ ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వడంతో.. కేవలం మలయాళం మాత్రమే మిగిలింది. అక్కడ కూడా ఒకసారి కనిపిస్తే అన్నీ ఇండస్ట్రీలు కవర్ చేసిన ఏకైక కమెడియన్ గా చిరస్థాయిగా నిలిచిపోతాడు అలీ.