“దిల్, ఆర్య” టైమ్ లో నిర్మాతగా దిల్ రాజు ప్లానింగ్ మరియు పద్ధతులు చూసి బడా నిర్మాతలైన రామానాయుడు, సురేష్ బాబులు సైతం నివ్వెరపోయేవారట. ఆ ప్లానింగ్ తోనే తక్కువ కాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగాడు దిల్ రాజు. అయితే.. గతేడాది మాత్రం ఆయనకు అంతగా అచ్చిరాలేదు. వరుస పరాజయాలు, భారీ నష్టాలతో కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ.. ఈ ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ లాభాలు దక్కించుకోవాలన్న తపనతో ముందడుగు వేస్తున్నాడు. అయితే.. నష్టపోకూడదు అనే అతి జాగ్రత్తతో లాభాలు తెచ్చిపెట్టే మార్గాలకు కూడా దూరమవుతున్నాడు.
కమర్షియల్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ లో ఎప్పుడూ ముందుండే దిల్ రాజు.. ఎందుకనో “ఇస్మార్ట్ శంకర్” డిస్ట్రిబ్యూషన్ జోలికి మాత్రం పోలేదు. ట్రైలర్ ఇంపాక్ట్ బాగోలేకనో లేక ఇన్సైడ్ సోర్సస్ చెప్పిన కారణంగానో దిల్ రాజు “ఇస్మార్ట్ శంకర్” చిత్రాన్ని కొనలేదు. దాంతో భారీ ప్రాఫిట్స్ ను కోల్పోయాడని చెప్పాలి. ఈసారి రాజు కంటెంట్ ను బట్టి కాకుండా మాస్ ఎలిమెంట్స్ కూడా కన్సిడర్ చేస్తే బాగుండు,