దర్శకుడు శైలేష్ కొలను.. పరిచయం అవసరం లేని పేరు. ‘హిట్’ ‘హిట్ 2’ ‘హిట్ 3’ వంటి సూపర్ హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. ‘హిట్’ యూనివర్స్ లో భాగంగా మరో 4 సినిమాలు కూడా వస్తాయని ప్రకటించి ఆసక్తి రేపాడు. మధ్యలో ‘సైందవ్’ సినిమా వచ్చింది. కానీ అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత ఆడలేదు కానీ.. ఆ సినిమాలో వెంకటేష్ ను ఫ్యాన్స్ కి నచ్చే విధంగా ప్రజెంట్ చేసి ప్రశంసలు అందుకున్నాడు.
శైలేష్ దర్శకత్వ ప్రతిభ వల్లే… అతని గత చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా.. వెంటనే ‘హిట్ 3’ చేసే అవకాశం లభించింది. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా హీరో నానిని, శైలేష్ ప్రజెంట్ చేసి తీరు అందరినీ ఆకట్టుకుంది. అతని స్టైలిష్ మేకింగ్ తో ‘హిట్ 3’ రూపంలో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని.. ఫామ్లోకి వచ్చాడు. దీంతో అతని నెక్స్ట్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శైలేష్ తన నెక్స్ట్ సినిమాని శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో చేయబోతున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.ఇది పక్కా రామ్ కామ్ మూవీ అని తెలుస్తుంది. ఒక రకంగా ఇది అందరినీ సర్ప్రైజ్ చేసే అంశమే. శైలేష్ శైలికి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది అని ముందు నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. ఫైనల్ గా అదే నిజమవ్వనుంది.
వాస్తవానికి ‘సైందవ్’ తర్వాత శైలేష్.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లోనే సినిమా చేయాలి. కానీ నాని నుండి పిలుపు రావడంతో వెళ్లి ‘హిట్ 3’ చేసొచ్చాడు.శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్ కి సాఫ్ట్ ఇమేజ్ ఉంది. కాబట్టి.. శైలేష్ పంధా మార్చుకుని ఈ సినిమా స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
