ఈ మధ్య మన టాలీవుడ్ టైమ్ అస్సలు బాలేదు. భారీ అంచనాలతో విడుదలయిన బడా సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కబాలి మూడీ భారీ డిజాస్టర్స్ గా మారిపోయి అభిమానుల్ని తీవ్ర నిరాశ పరిచాయి. అయితే త్వరలో రాబోతున్న జనతా గ్యారేజ్ పై సైతం భారీ అంచనాలే ఉండడం, అదే క్రమంలో ఈ సినిమా ట్రైలర్ సైతం సూపర్ డూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా కొన్ని లెక్కలను చూస్తుంటే ఈ సినిమా బయ్యర్స్ కి భయంగా ఉంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. విషయంలోకి వెళితే…‘జనతా గ్యారేజ్’ నిర్మాణానికి దాదాపు 65 కోట్ల వరకు ఖర్చు అయిన నేపధ్యంలో ఈ సినిమా బిజినెస్ 70 కోట్ల వరకు జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 12 కోట్లకు అమ్మివేసారు అన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు లాభం పొందాలి అంటే ఈ సినిమా దాదాపుగా 80 కోట్ల వరకు వసూళ్లు సాదించాల్సి ఉంటుంది. అంటే ‘జనతా గ్యారేజ్’ 100 కోట్ల సినిమాగా ఎట్టి పరిస్థుతులలోను మారి తీరాలి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు విషయం ఏమిటంటే…
ఈ సినిమా పాటలు అన్నీ కాస్త క్లాస్ టచ్ తో ఉండడంతో, ఎంత కొరటాల శివ, జూనియర్ ల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఇంత భారీగా నిర్మించినా ఈసినిమా మాస్ కు కనెక్ట్ అవ్వడంలో ఏదైనా పొరపాటు జరిగితే బయ్యర్లు తీవ్రంగా నష్టపోతారు అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఫ్లాప్ సెంటిమెంట్ ను దాటుకుని ఎన్టీఆర్ సక్సెస్ అందుకుంటాడా? లేకపోతే మిగిలిన హీరోలలాగానే బాక్స్ ఆఫీస్ వద్ద మౌనం వహిస్తాడా అనేది త్వరలో తెలిసిపోతుంది.