బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే మొదటి వారం ఎలిమినేషన్స్ కి రంగం సిద్ధ అయ్యింది. ఈసారి నామినేషన్స్ లో మొత్తం 8మంది ఉన్నారు. వీళ్లలో ఐదుగురు ఫిమేల్ కంటెస్టేంట్స్ శోభాశెట్టి, షకీల, కిరణ్ రాథోడ్, థామిని ఇంకా రతిక ఉంటే, ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ ప్రిన్స్ యవార్, గౌతమ్ కృష్ణ, ఇంకా పల్లవి ప్రశాంత్ లు ఉన్నారు. మరి వీళ్లలో మీరు ఎవరికి ఓటు వేయాలన్నా కూడా ఈ 7 పాయింట్స్ జాగ్రత్తగా చదవండి. అసలు నామినేషన్స్ లో ఏం జరిగిందనేది క్లియర్ గా తెలుసుకున్న తర్వాత ఓటు వేయండి.
నెంబర్ – 1
శోభాశెట్టి కిరణ్ రాథోడ్ కి తెలుగు రాదనే రీజన్ తో నామినేట్ చేసింది. అలాగే, పల్లవి ప్రశాంత్ తనని వీక్ గా ఉంటోందని బాధపడుతోందని నామినేట్ చేశాడు. అలాగే టేస్టీ తేజ కూడా తెలుగు రాదనే కారణమే చెప్పాడు. ఇక్కడ క్లియర్ గా తనకి ఫాలోయింగ్ లేదని నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అవుతుందని తెలిసే తెలివిగా గేమ్ ఆడారా అనేది పాయింట్.
నెంబర్ – 2
శోభాశెట్టి గౌతమ్ కృష్ణని ఐ కాంటాక్ట్ లేదని, మేడమ్ అంటూ వెటకారంగా మాట్లాడాడు అంటూ నామినేట్ చేసింది. అంతేకాదు, తను తిరిగి తనని నామినేట్ చేసేటపుడు కన్ఫషన్ రూమ్ లో కూర్చుని చప్పట్లు కొట్టింది. అంతేకాదు, ప్యాచ్ అప్ చేసుకుంటానికి వచ్చినపుడు కూడా యాటిట్యూడ్ చూపించింది. తన నామినేషన్ రైట్., మీది రాంగ్ అని నిరూపించే ప్రయత్నం చేసింది. అలాగే, థామినీ విషయంలో కూడా తనని మాట్లాడనివ్వకుండా సోలోగా డామినేట్ చేసింది. కంప్లీట్ గా కార్తీకదీపం మోనితని చూపించేసింది శోభాశెట్టి.
నెంబర్ – 3
ప్రిన్స్ యవార్ టేస్టీ తేజ మాటలు నమ్మి గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. ఇదే విషయాన్ని మళ్లీ గౌతమ్ నిరూపించాడు. టేస్టీ తేజని తీస్కుని వచ్చి నిజం చెప్పించాడు. అది వాంటెడ్ గా టేస్టీ తేజ ఆడిన గేమ్ అని క్లారిటీ ఇచ్చాడు. ఇది బాగా వర్కౌట్ అయ్యింది. తేజ అడ్డంగా దొరికిపోయాడు. ఈవిషయం లో ఖచ్చితంగా నాగార్జున వీకెండ్ క్లారిటీ ఇస్తాడు. తర్వాత ప్రిన్స్ అయితే రియలైజ్ అయ్యాడు.
నెంబర్ – 4
సందీప్ నామినేషన్స్ లో వాలిడ్ అనిపించలేదు. ప్రిన్స్ విషయంలో అందరూ చెప్పిందే తను కూడా చేప్పాడు. సేఫ్ గా నామినేట్ చేశాడు. అలాగే రతికని అనవసరంగా నామినేట్ చేసి దాన్ని నిరూపించు కోవడానికి వెళ్లి బిస్కెట్ అయిపోయాడు. రతికని చాలామంది వాంటెడ్ గా టార్గెట్ చేశారనే అనిపించింది. అలాగే, ప్రిన్స్ ని కూడా టార్గెట్ చేశారు. గౌతమ్ కూడా వాళ్లకి బాగా దొరికాడు. దీంతో శుభశ్రీ- గౌతమ్, కిరణ్ రాథోడ్, థామినీ ఈ నలుగురు కూడా శోభాశెట్టిని నామినేట్ చేసేశారు. గ్రూప్స్ అయితే క్లియర్ గానే ఫామ్ చేసుకుంటున్నారు.
నెంబర్ 5
శుభశ్రీ నామినేషన్స్ చూస్తే కావాలనే రతిక ఇంకా శోభాశెట్టి ఇద్దరినీ అనుకుని నామినేట్ చేసింది. రీజన్స్ కూడా అంత వాలిడ్ గా లేవు. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ తనకైనా అర్ధమయ్యాయా లేవా అనిపించింది.
నెంబర్ – 6
ఎంటైర్ నామినేషన్స్ లో రతిక, అమర్ దీప్ చెప్పిన రీజన్స్ కొద్దిగా వాలిడ్ గా అనిపించాయి. ఇద్దరూ కూడా గేమ్ గురించే నామినేట్ చేశారు. ప్రిన్స్ ని రిస్ట్రిక్టడ్ ఏరియాకి వెళ్లాడని అమర్ నామినేట్ చేశాడు. అలాగే, ఇద్దరి మద్యలో పుల్లలు పెట్టి తలదూర్చకూడదని టేస్టీతేజని నామినేట్ చేశాడు. అలాగే, రతిక కూడా డీలక్స్ రూమ్ లో పడుకునే హక్కు మీకు లేదని ప్రియాంకని ఇంకా థామినిని నామినేట్ చేసింది.
నెంబర్ – 7
ఓవర్ ఆల్ నామినేషన్స్ లో నలుగురు బాగా టార్గెట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి, ప్రిన్స్, ఇంకా రతిక. రతికని అయితే చాలా అండరెస్టిమేట్ చేస్తున్నారని అనిపించింది. అలాగే, లేడీస్ గ్యాంగ్ లో చాలామంది రతికకి ఎగైనిస్ట్ గానే ఉన్నారు. ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా ఇచ్చిపారేయడానికి సిద్ధంగా ఉన్నారు.