వర్షాలు, ఐపీఎల్ మ్యాచులు మాత్రమే మొన్నటివరకు సినిమాల విడుదలకు ఇబ్బందిగా ఉండేవి. కానీ.. విచిత్రంగా మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలు నాలుగు సినిమాల పాలిట యమపాశంగా మారాయి. గత శుక్రవారం విడుదలైన “సుబ్రమణ్యపురం, కవచం, నెక్స్ట్ ఏంటి, శుభలేఖలు” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి. ఈ మూడింటిలో ఓవరాల్ గా బాగున్న సినిమా “సుబ్రమణ్యపురం” ఒక్కటే అయినప్పటికీ.. తెలంగాణలో ఎన్నికల కారణంగా ఉదయం రెండు షోస్ ఎక్కడా పడలేదు. సాయంత్రంలోపు టాక్ బయటకి వచ్చేయడంతో ఈవెనింగ్ షోస్ ఫుల్ అవ్వలేదు. దాంతో నాలుగు సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయినట్లే.
అయినా.. ఎలక్షన్స్ రోజు సినిమా విడుదల చేయడం కూడా తప్పే. పౌరులు తమ ప్రాధమిక బాధ్యతను నెరవేర్చుకోవాలి అని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు కూడా సెలవు ప్రకటించగా, అదేదో పబ్లిక్ హాలీడే అన్నట్లు పోటీపడి మరీ సినిమాలు రిలీజ్ చేయడం ఏమిటో అర్ధం కాలేదు. ఇకనైనా ఈ తరహా తప్పుల్ని ఇండస్ట్రీ చేయదని భావించాలి.