యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ మధ్య కాలంలో కలిసి కనిపించిన సందర్భాలు తక్కువనే సంగతి తెలిసిందే. తారక్, చరణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి తాము ప్రకటించిన విరాళాలను అందజేయనున్నారనే వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది. వైరల్ అయిన వార్తను చాలామంది నిజమని నమ్మారు. ప్రముఖ న్యూస్ ఛానెళ్లు సైతం ఈ వార్తను ప్రసారం చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Jr NTR, Ram Charan
అయితే చరణ్ కానీ తారక్ కానీ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని ఏపీ సీఎంను కలవడానికి తారక్ చరణ్ వెళ్లారని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చింది. అయితే వైరల్ అయిన వార్త ఫేక్ న్యూస్ అయినా అటు చరణ్ ఫ్యాన్స్ ఇటు తారక్ ఫ్యాన్స్ ఈ వార్త వల్ల ఎంతగానో ఎగ్జైట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను కలవాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.
మరోవైపు దేవర (Devara) సినిమాలో అలియా భట్ (Alia Bhatt) గెస్ట్ రోల్ లో నటిస్తున్నారంటూ ఒక వార్త వైరల్ కాగా ఆ వార్త గురించి అలియా భట్ స్పష్టత ఇచ్చారు. వైరల్ అయిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు. కరణ్ జోహార్ (Karan Johar) జిగ్రా ప్రమోషన్స్ లో భాగంగా కరణ్ జోహార్ ను కలిశారు. వాస్తవానికి దేవర మూవీలో హీరోయిన్ గా మొదట అలియా భట్ పేరును పరిశీలించడం జరిగింది.
దేవర సినిమా విడుదలకు మరో 13 రోజుల్లో విడుదల కానుంది. దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విదేశీ ప్రేక్షకుల నుంచి కూడా ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దేవర రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.