టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలం క్రితం వరకు శ్రీలీల గోల్డెన్ లెగ్ ట్యాగ్ తో కొనసాగారు. అయితే శ్రీలీలకు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్నాయి. భగవంత్ కేసరి మినహా ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన సినిమాలేవీ ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు. అయితే శ్రీలీలలా మృణాల్ ఠాకూర్ కూడా గోల్డెన్ లెగ్ ఇమేజ్ తో కొనసాగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం, హాయ్ నాన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
ఆ సెంటిమెంట్ ప్రకారం ఫ్యామిలీ స్టార్ (Family Star) బ్లాక్ బస్టర్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో మృణాల్ ఠాకూర్ మరిన్ని సినిమా ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం అయితే ఉంది. 2024 సంవత్సరంలో చేతినిండా ఆఫర్లతో మృణాల్ ఠాకూర్ బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
మృణాల్ ఠాకూర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఈ మధ్య కాలంలో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. మృణాల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కథల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ ఇతర సౌత్ భాషలపై దృష్టి పెడితే ఆమె కెరీర్ పరంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉంది. ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.