ఏంటీ కేటీఆర్ రాజకీయనాయకుడు కదా… నటుడు అంటారేంటి అనుకుంటున్నారా? ఆ మాట అన్నది మేం కాదు, యువ కథానాయకుడు సుధీర్‌బాబు. ఎందుకన్నాడు, ఎలా అన్నాడు, ఎప్పుడు అన్నాడు, ఎవరితో అన్నాడు అనేది తెలిస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. నగరంలోని హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియా జాయ్ కార్యక్రమం ఈ సరదా సంభాషణకు వేదికైంది. ఇంతకీ ఏమైందంటే… ఇండియా జాయ్‌కు అతిథిగా విచ్చేసిన సుధీర్‌బాబు… మంత్రి కేటీఆర్‌పై సరదాగా పంచ్‌లు వేశారు.
కేటీఆర్‌లో రాజకీయ నాయకుడి కంటే నటుడు బాగా కనిపిస్తారన్నారు. సుధీర్‌బాబు మాటలు విన్న కేటీఆర్… నవ్వుతూ ఆ మాటలను గుర్తుపెట్టుకుంటానని చమత్కరించారు. ఈ సంభాషణ… ఇండియా జాయ్‌లో నవ్వులు పూయించింది. కేటీఆర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో రాజకీయ నాయకుడితోపాటు మంచి నటుడు కూడా ఉన్నాడు. నటుడు అంటే అన్నీ మరిచిపోయి పాత్రకు తగినట్లు నటించాలి. రాజకీయ నాయకుడు ప్రజలకు మంచి చేయాలంటే తన గురించి, కుటుంబం గురించి మరిచిపోయి పనిచేయాలి.
కేటీఆర్ అచ్చంగా అలా చేస్తారు. అందుకే నేను మంచి నటుడు అన్నాను. భవిష్యత్‌లో నేను రాజకీయ నాయకుడిగా నటించే అవకాశం వస్తే కేటీఆర్‌ను ఫాలో అవుతా. ఆయనలా ఉండటానికి ప్రయత్నిస్తా. కేటీఆర్ సినిమాల్లోకి రానందుకు ఆనందంగా ఉంది అని అన్నాడు సుధీర్‌బాబు. సుధీర్‌బాబు కామెంట్స్‌కు కేటీఆర్ స్పందిస్తూ సుధీర్ నన్ను అనుకోకుండా నటుడ్ని చేశాడు. నేను రాజకీయ నాయకుడు కంటే నటుడిగా బాగుంటావన్నాడు. ఓకే సుధీర్ ఈ మాట మనసులో పెట్టుకుంటా అంటూ నవ్వేశారు కేటీఆర్.