తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరు స్టార్ హీరోలు, యంగ్ హీరోలు ఉన్నప్పటికీ వారిలో సక్సెస్ ఫుల్ హీరోలు మాత్రం చాలా తక్కువమంది ఉన్నారు. ప్రెజంట్ ఇండస్ట్రీలో తిప్పికొడితే అయిదారుగురు మాత్రమే సక్సెస్ ఫుల్ హీరోలున్నారు. ఇక్కడ సక్సెస్ కు నిదర్శనం హిట్ చిత్రాలు మాత్రమే అయినప్పటికీ.. ఈ హిట్ లలో కూడా చాలా రకాలున్నాయి. ఒక హీరో కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఎన్ని సినిమాలు 50 కోట్లు లేదా 100 కోట్ల కలెక్షన్ ను సాధించాయి అనేదాన్ని బట్టి హీరో స్టార్ డమ్ ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా తెలుగులో 100 కోట్ల క్లబ్ లో ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మాత్రమే. అయితే.. 50 కోట్ల క్లబ్ లో మాత్రం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతోపాటు పైన పేర్కొన్న హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.
విజయ్ నటించిన తాజా చిత్రం “గీత గోవిందం” నిన్నటితో 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అంటే 37 కోట్ల షేర్ వచ్చినట్లు అన్నమాట. ఇవాళ బక్రీద్ అవ్వడంతోపాటు ఈవారం కూడా పెద్దగా సినిమాలేవీ లేకపోవడంతో “గీత గోవిందం” ఈ రెండ్రోజుల్లో మరో 15 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడం అనేది చాలా ఈజీ అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. “అర్జున్ రెడ్డి” సినిమాకి కొద్దిలో మిస్ అయిన 50 కోట్ల మార్క్ ని “గీత గోవిందం”తో సునాయాసంగా క్రాస్ చేసి కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాడు విజయ్.