మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ రేపు అనగా అక్టోబర్ 5న విజయదశమి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
‘ఆచార్య’ ఫలితాన్ని మరిపించి ఈ దసరాకి మెగాస్టార్ చిరంజీవి ఓ సూపర్ హిట్ ను అందిస్తారు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ అంత కాకపోయినా ఈ మూవీకి కూడా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
22.00 cr
సీడెడ్
11.90 cr
ఉత్తరాంధ్ర
8.50 cr
ఈస్ట్
6.50 cr
వెస్ట్
6.00 cr
గుంటూరు
6.50 cr
కృష్ణా
5.50 cr
నెల్లూరు
3.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
6.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.10 cr
ఓవర్సీస్
9.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
89.90 cr
‘గాడ్ ఫాదర్’ చిత్రానికి తెలుగు వెర్షన్ కు గాను రూ.89.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.91 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. హిందీ వెర్షన్ కు ఎంత బిజినెస్ జరిగింది.. అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. పాజిటివ్ టాక్ వస్తే పండుగ సెలవుల్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.