శుక్రవారం సినిమాల సందడి ఎప్పుడూ ఉండేదే. కానీ.. ఈ శుక్రవారం పోరు మాత్రం కాస్త వైవిధ్యంగా మారింది. ఎందుకంటే.. ఒకవారం ఒకేరోజు విడుదలయ్యే నాలుగుగైదు సినిమాల రిజల్ట్స్ తెలియాలంటే కనీసం సాయంత్రం దాకా వెయిట్ చేసి, పబ్లిక్ టాక్ లేదా రివ్యూలను బట్టి ఆరోజు సాయంత్రం లేదా తరువాతి రోజు సినిమాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకొంటారు ప్రేక్షకులు. కానీ.. విచిత్రంగా ఈవారం విడుదలలైన “7, హిప్పీ, కిల్లర్” సినిమాల్లో ఆల్రెడీ “7, హిప్పీ” చిత్రాల రిజల్ట్స్ తెలిసిపోవడంతో అందరిచూపు విజయ్ ఆంటోనీ “కిల్లర్” మీద ఉంది. ట్రైలర్ కాస్త ఆసక్తికరంగా ఉండడమే కాదు.. సినిమాలో అర్జున్ లాంటి మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ కూడా కీలకపాత్ర పోషించి ఉండడం, హాలీవుడ్ సినిమా “లా ఎబైడింగ్ సిటిజన్”కి రీమేక్ లా సినిమా కాన్సెప్ట్ ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యాయి.
విజయ్ ఆంటోనీ కూడా “బిచ్చగాడు” తర్వాత సరైన హిట్ ఒక్కటీ కొట్టలేదు. ఆ తర్వాత వచ్చిన “భేతాళుడు, యముడు నుంచి రీసెంట్ గా వచ్చిన రోషగాడు” వరకూ అన్నీ బాక్సాఫీస్ దగ్గర కుదేలయ్యాయి. రేపు విడుదలవుతున్న “కిల్లర్” ట్రైలర్ లో మాత్రం కాస్త కంటెంట్ ఉన్నట్లు కనిపిస్తోంది. సో, “కిల్లర్” ఏమాత్రం బాగుంది అని టాక్ వచ్చినా విజయ్ ఆంటోనీ మళ్ళీ హిట్ కొట్టడం ఖాయం. మరి విజయ్ ఈ అవకాశాన్ని ఏమేరకు సద్వినియోగపరుచుకుంటాడో చూడాలి.