ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై హనుమాన్ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను అందించగా దర్శకుడు ప్రశాంత్ వర్మ కీర్తి ప్రతిష్టలను పెంచింది. అయితే ఈ సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లలో ఏకంగా 5 కోట్ల రూపాయలను డొనేషన్ల రూపంలో ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. హనుమాన్ నిర్మాతల డొనేషన్ల లెక్క తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న హనుమాన్ నిర్మాతలు గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమా కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఈ సినిమా రూపంలో ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. జై హనుమాన్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటుందని ఈ సినిమా హక్కుల కోసం పోటీ కూడా భారీ లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ తో మ్యాజిక్ చేసిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను అంతకు మించి అనే రేంజ్ లో తీస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైతే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని చెప్పవచ్చు. జై హనుమాన్ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తే మాత్రం (Hanu Man) ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జై హనుమాన్ లో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. జై హనుమాన్ సినిమాకు చిరంజీవి, మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హనుమాన్ మూవీకి ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.