హైదరాబాద్ నగరంలో ఈ నెల 14వ తేదీ నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. నగరంలోని ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ఈ మహాసభలు ప్రారంభం కానున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్‌గార్డెన్స్, భారతీయ విద్యాభవన్, రవీంద్రభారతి వంటి వేదికల ఆవరణలోను ఈ సభలు కొనసాగుతాయి. అందుకు తెలంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మన సంస్కృతీలో ముఖ్యమైన “అతిధి దేవోభవా” అన్న మాటను నిజం చేసేలా ప్రతినిధులకు స్వాగతం పలికేలా ఆకర్షణీయంగా ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు తెలంగాణ వైభవాన్ని, తెలుగు ప్రాముఖ్యత ను అందరికీ తెలిసేలా జరుగుతున్న ఈ సభల కోసం ఓ ప్రచార గీతాన్ని రూపొందించే పనిని దర్శకుడు హరీష్ శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది.
తెలుగు వైభవాన్ని చాటి చెప్పేలా ఈ గీతాన్ని ఓ ప్రముఖ గీత రచయిత రాసారు. అలాగే సంగీతాన్ని కంపోజింగ్ కూడా పూర్తి అయింది. . ఈ రోజు నుండి పాటకు సంబందించిన షూటింగ్ ని హరీష్ మొదలు పెట్టారు. వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి.. టీవీలలో ప్రసారం చేయనున్నారు. సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ డైరక్టర్ రూపొందిస్తున్న ఈ ప్రచార గీతం ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.