టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్ Srikanth) , ఇప్పుడు తన కుమారుడు రోషన్ (Roshan) సినీ కెరీర్‌ను దృఢంగా ప్లాన్ చేస్తున్నాడు. చిన్న వయసులోనే చక్కటి లుక్స్, స్టైల్‌తో ఆకట్టుకున్న రోషన్, నిర్మలా కాన్వెంట్, పెళ్లి సంద-డి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యువతలో, ప్రత్యేకంగా లేడీస్ లో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇప్పటి వరకూ అతను చేసిన సినిమాలు పూర్తిగా కమర్షియల్ హిట్‌గా నిలవలేదు.
అందుకే, ఇప్పుడు భారీ ప్రాజెక్టులతో రోషన్ కెరీర్‌ను కొత్త లెవెల్‌కి తీసుకెళ్లేందుకు శ్రీకాంత్ కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం రోషన్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో రూపొందుతున్న చాంపియన్స్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే, కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నట్లు సమాచారం. లింగుస్వామి ఈ సినిమాను తక్కువ సమయంలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడని, ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కోసం కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
రోషన్ కోసం ఇప్పటికే టాలీవుడ్‌లో మరో నాలుగు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయని, వాటిలో రెండు స్క్రిప్టులు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నట్లు టాక్. రోషన్ సెట్ చేసిన కొత్త ప్రాజెక్టులు చూస్తే, ఈసారి పూర్తిగా కమర్షియల్ యాంగిల్‌లో మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా స్క్రిప్ట్‌లు ఎంచుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు మైన్‌స్ట్రీమ్ హీరోలుగా నిలిచిన వారసుల్లో రోషన్ కూడా తన స్థానం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట.
శ్రీకాంత్ ఎప్పుడూ మెగా ఫ్యామిలీతో దగ్గరగా ఉంటూ, మంచి బూస్ట్ ఇచ్చేలా తన కుమారుడి కెరీర్‌ను డిజైన్ చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్. ఇప్పటివరకు రోషన్ చేసిన సినిమాలు అతని యూత్‌ఫుల్ లుక్స్‌ను హైలైట్ చేసేలా ఉండగా, ఇకపై పూర్తిగా మాస్ హీరోగా ఎదిగేలా స్క్రిప్ట్‌లు ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. చాంపియన్స్ విడుదల తర్వాత రోషన్ స్టార్ హీరోల లిస్టులో చేరే అవకాశాలు ఉన్నాయా..
ఈ ప్రాజెక్ట్స్ నిజంగా అతనికి పెద్ద బ్రేక్ అందిస్తాయా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఈ ఏడాది రోషన్ కెరీర్‌లో కీలకమైనదని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. వరుసగా వర్క్ చేస్తూ తనను మాస్ ఆడియెన్స్‌కు దగ్గర చేసేలా, పర్ఫెక్ట్ హీరోగా మలుచుకునేలా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు. అయితే, అతని సినిమాలు ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.