మాస్ మహారాజ్ రవితేజ చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఒకటి. జూలై 29న ఈ మూవీ విడుదల కాబోతుంది. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రజిష విజయన్, ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.కార్తీ ‘ఖైదీ’ కి సంగీతం అందించిన సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కావడం విశేషం.
జూలై 29న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చాలా కాలం తర్వాత తొట్టెంపూడి వేణు ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.దాదాపు 9 ఏళ్ళ తర్వాత అతను రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో తన పాత్ర గురించి అలాగే హీరో రవితేజ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “రవితేజతో పనిచేయడం అంటే ఒక పవర్ హౌస్ తో పని చేసినట్లు అనిపిస్తుంది.
అతని ఎనర్జీ లెవల్స్… ఒక పవర్ హౌస్ లా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా చాలా చిన్న విషయం అన్నట్టు తీసుకుంటాడు. దేనిని కూడా కాంప్లికేటెడ్ అనుకోడు. సెట్ లో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు స్క్రిప్ట్ పేపర్ చూసుకుంటాడు.. ‘ఏముంది.. ఇందులో అంటాడు’.. కానీ దాని కోసం చాలా కష్టపడతాడు.. హోమ్ వర్క్ చేస్తాడు. అతనికి ఏం కావాలో తెలుసు, అన్నిటికంటే మించి అతనికి ఏం కావాలో క్లారిటీ ఉంది.
మా ఇద్దరి కాంబినేషన్లో చాలా సన్నివేశాలు ఉంటాయి.అతను వేరే ప్రొఫెషన్.. నేను వేరే ప్రొఫెషన్.ఇలాంటి పాత్ర నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. కానీ ప్రతి సీన్ బాగా వచ్చింది. స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ఆడియన్స్ అవి చూసి ఎంజాయ్ చేస్తారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనేది ఔట్ అండ్ ఔట్ రవితేజ సినిమా” అంటూ వేణు చెప్పుకొచ్చాడు.