బిగ్‌బాస్ షో స్క్రిప్టెడ్ కాదు అంటుంటారు… అప్పటికప్పుడు చెప్పి లైవ్ ఎమోషన్స్ చూపిస్తాం అని చెబుతారు. అక్కడ జరిగింది యాజ్ ఇట్ ఈజ్‌గా చూపిస్తున్నాం.. ఎడిటింగ్ మాయ లేదు అని కూడా చెబుతుంటారు. అయితే ఈ మాటలు అంతగా నమ్మలేం. కానీ కొంతమంది నమ్ముతుంటారు. అలాంటి వాళ్ల కోసమే మా ఈ ప్రయత్నం. మేం చెప్పేది విన్నాక ఇప్పటికీ బిగ్‌బాస్ స్క్రిప్టెడ్ షో కాదని అనిపిస్తే మీ ఇష్టం.
మొన్న ఆదివారం టెలీకాస్ట్ అయిన బిగ్‌బాస్ ఎపిసోడ్ చూశారా… భలే చేశారు కదా ఇంటి సభ్యులు ర్యాంప్ వాక్. దానికి ముందు లివింగ్ ఏరియాలో స్వాతి దీక్షిత్‌తో మాట్లాడారు. ర్యాంప్ వాక్ తర్వాత 1 టు 6 స్టాండింగ్ కార్యక్రమం జరిగింది. చూడటానికి ఇదంతా బాగుండొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంట్లోని మగాళ్ల మీసాలు, గడ్డాలు. స్వాతి దీక్షిత్ వెళ్లిపోయాక నాగార్జున ర్యాంప్ వాక్ టాస్క్ పెట్టాడు. మరి అలాంటి టాస్క్ ఉంటుందని ఇంట్లో వాళ్లకు ముందే తెలుసా? ఉదయాన్నే బిగ్‌బాస్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడా? లేకపోతే ఎందుకు మీసాలు గెడ్డాలు తీసేసి కూర్చుంటారు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే… స్వాతి దీక్షిత్ స్టేజీ మీద చెప్పిన మాటలు బ్లాక్ కంటే ముందే ర్యాంప్ వాక్ షో అయిపోయింది. ఆ తర్వాతనే ముఖానికి మేకప్‌లు తీసేసి వచ్చి లివింగ్ ఏరియాలో కూర్చున్నారు. ఆ తర్వాత బయట 1 టు 6 టాస్క్ జరిగింది. కానీ చూపించినప్పుడు తొలుత స్వాతి దీక్షిత్ స్టేజీ మీద మాటలు చూపించారు. తర్వాత ర్యాంప్ వాక్‌గా చూపించారు. అంటే ఇక్కడ ఎడిటింగ్ వాడారు. స్క్రిప్టెడ్ షో కాదని చెప్పే బిగ్‌బాస్… ఇలా ఎందుకు చేశారో మరి.