రానా దగ్గుబాటి ఎంతో ఇష్టంగా చేసిన ప్రాజెక్టులలో విరాటపర్వం ఒకటి. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని రానా గత ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ సినిమా విడుదల సమయానికి ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మధ్యలో రీ షూట్స్ కారణంగా సినిమా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి.. అంతేకాకుండా కరోనా పరిస్థితుల కారణంగా రెండు సార్లు సినిమా థియేటర్స్ మూత పడడంతో వాయిదా వేయక తప్పలేదు.
దీంతో రానా దగ్గుబాటి కొన్నాళ్ళకు సినిమా రిలీజ్ విషయంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్ కూడా వచ్చింది. అసలైతే రానా దగ్గుపాటి డిసెంబర్లోనే సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులతో చర్చలు జరిపాడు. కానీ చిత్ర నిర్మాత సురేష్ బాబు మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.. ఇక ప్రస్తుతం పరిస్థితులు ఎంత వరకు అనుకూలిస్తాయి చెప్పడం కష్టం గానే ఉంది. ఒకవేళ వాతావరణం బాగానే కూడా పెద్ద సినిమాల నుంచి పోటీ పడక తప్పదు.
ఇక ఏమి చేసేది లేక చిత్ర నిర్మాత సురేష్ బాబు ఇటీవల ఒక ఓటీటీ సంస్థతో మరోసారి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ విరాటపర్వం సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు చాలా సార్లు ప్రయత్నాలు చేసింది కానీ ఆ విషయం లో చిత్ర యూనిట్ సభ్యులు ధైర్యం చేయలేకపోతున్నారు. విరాట పర్వం సినిమాలో రానా దగ్గుబాటి తో పాటు సాయి పల్లవి ప్రియమణి వంటి వారు కీలక పాత్రల్లో నటించారు..
నీది నాది ఒకే కథ వంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక సురేష్ బాబు తో పాటు సుధాకర్ చేరుకురి కూడా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు మరోసారి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకు 15 కోట్లకు పైగా ఆఫర్ చేసి కొనుగోలు చేసుకునెందుకు సిద్ధంగా ఉందట. 20కోట్ల డీల్ సెట్ అయితే నిర్మాతలు ఓటీటీకి రిలీజ్ కు సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.