టాలీవుడ్ ఇండస్ట్రీలో 100కు పైగా సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో సక్సెస్ లను అందుకున్న డైరెక్టర్లలో రాఘవేంద్రరావు ఒకరు. రాఘవేంద్రరావు అలనాటి స్టార్ హీరోలలో దాదాపుగా అందరు హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభకు ఎన్నో అవార్డులు వచ్చాయి. స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న చాలామంది హీరోల తొలి సినిమాలు రాఘవేంద్రరావు డైరెక్షన్ లోనే తెరకెక్కడం గమనార్హం.
అయితే రాఘవేంద్రరావు పేరు వెనుక బి.ఎ. ఉంటుంది. ఈ విధంగా రాఘవేంద్రరావు పేరు వెనుక బి.ఎ ఉండటానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఒక సందర్భంలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ నేను డైరెక్టర్ కాకపోతే డ్రైవర్ అయ్యేవాడినని అన్నారు. ఎందుకంటే నాకు ఏమీ తెలియదని రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చారు. అప్పట్లో బీఏ చదివిన వాళ్లకు డ్రైవర్ కు వచ్చే శాలరీ కూడా వచ్చేది కాదని రాఘవేంద్ర రావు వెల్లడించారు.
నేను డైరెక్షన్ చేసిన రెండు మూడు సినిమాలకు రాఘవేంద్రరావు బీఏ అని వేయగా ఆ సినిమాలు బాగా ఆడాయని ఆయన చెప్పుకొచ్చారు. నా పేరు వెనుక డిగ్రీ పెట్టని ఒక సినిమా మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుందని ఆయన కామెంట్లు చేశారు. ఆ సమయంలో సెంటిమెంట్ అనిపించి పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారికి గుర్తు చేశానని రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చారు. బీఏ సెంటిమెంట్ గా అనిపించి నా పేరు చివరన బీఏ యాడ్ చేయాలని నేను సూచించానని రాఘవేంద్ర రావు కామెంట్లు చేశారు.
డైరెక్టర్ కాకపోతే ఏమై ఉండేవాడినని నాకు నేనుగా ప్రశ్నించుకున్నానని కనీసం చెక్ చేయడం రాదని టికెట్ కొనుక్కోవడం కూడా రాదని రాఘవేంద్ర రావు తెలిపారు. ప్రొడక్షన్ మేనేజర్లు, నిర్మాతలు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారని రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చారు. అన్నీ వాళ్లే చూసేవారని సాధారణంగా బీఏ చదివిన వాళ్లకు 5,000 రూపాయల కంటే ఎక్కువ జీతం ఇవ్వరని రాఘవేంద్ర రావు తెలిపారు. నాకు డ్రైవింగ్ బాగా వచ్చు కాబట్టి నేను డ్రైవర్ ను అయ్యేవాడినని ఆయన కామెంట్లు చేశారు.