నువ్వు ఎవరు.. నీ గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే.. సమాధానం కోసం కాసేపు ఆలోచించాల్సి ఉంటుంది. మరి ఇదే ప్రశ్న స్టార్స్ ని అడిగితే.. అలా అడగకుండానే ట్విట్టర్లో తమ గురించి సుత్తిలేకుండా సూటిగా చెప్పారు. కొంతమంది సరికొత్తగా నిర్వచించుకున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న స్టార్స్ ట్విట్టర్ ఇంట్రోస్ పై ఫోకస్..
పవన్ కళ్యాణ్ యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ స్టార్ హీరోనని, రాజకీయనాయకుడి అని చెప్పకుండా.. తాను దేశభక్తుడని “జై హింద్” అనే పదంతో స్పష్టం చేశారు.
మహేష్ బాబు మహేష్ తన సినిమాల్లో డైలాగ్ మాదిరిగా “నేను భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక నటుడ్ని” అంటూ ట్విట్టర్ ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు.
రాజమౌళి నేనెవర్ని అన్నిరాజమౌళి సింపుల్ గా ఫిలిం డైరక్టర్ అని పరిచయం చేసుకున్నారు. ఆయన సింప్లిసిటీ కి అది నిదర్శనం.
సుకుమార్ సినిమాలను క్రియేటివ్ గా తెరకెక్కించడమే కాదు… తనను తాను క్రియేటివ్ గా చెప్పుకున్నారు. “కాలేజీలో నేను లెక్చరర్ ని.. ఫిలిం మేకింగ్ లో ఎప్పుడూ విద్యార్థినే” అని సినిమాపై తన ప్యాషన్ ని తెలిపారు.
ఎన్టీఆర్ నువ్వు ఎవరు అనే ప్రశ్నకు ఒకే ఒక పదంలో ఆన్సర్ ఇచ్చిన హీరో ఎన్టీఆర్. నటుడు అనే పిలవడం తనకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందని ఎన్టీఆర్ ట్విట్టర్ ఇంట్రో ద్వారా తెలిపారు.
శోభు యార్లగడ్డ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ వాల్ట్ డిస్నీ చెప్పిన కొటేషన్ ని రాసుకొని తన ఇష్టాన్ని అందరికీ తెలిపారు. నమ్మిన దారిలో వెళ్ళమని సింపుల్ గా వెల్లడించారు.
దేవీ శ్రీ ప్రసాద్రెజ్యుమ్ లో ఉండే అన్నింటిని మూడు ముక్కల్లో దేవీ శ్రీ ప్రసాద్ చెప్పారు. సంగీత దర్శకుడు, సింగర్, ఫెర్ఫామెర్ అని పరిచయం చేసుకున్నారు.
రెజీనా కాసాండ్రా
హీరోయిన్ రెజీనా కాసాండ్రా కాస్త డిఫెరెంట్ గా పరిచయం చేసుకుంది. వేదాంత ధోరణిలో షో నడుస్తుంటుందని చెప్పి ఆకట్టుకున్నారు.
రామ్ పోతినేని “మొదట నేను మనిషిని.. ఆ తర్వాతే భారతీయుడిని” అని కవితాత్మకంగా హీరో రామ్ పోతినేని రాసి ఆకట్టుకున్నారు.
శ్రియ శరన్శ్రియ శరన్ నటిగా, సామజిక సేవ కార్యకర్తగా అందరికీ తెలుసు. ఆమెలో ఇంకా ఎన్నో కలలు ఉన్నాయని ట్విట్టర్ స్టేటస్ చెబుతోంది.
తాప్సి చిలిపిగా ఉండే తాప్సి .. చాలా తెలివిగా “అందరూ సమానమే.. అందరూ ఒకే విధంగా జన్మించారు” అనే అర్ధంలో స్టేటస్ రాసుకుంది.
మంచు మనోజ్ సినీ కుటుంబం నుంచి వచ్చిన మంచు మనోజ్ సినిమాల గురించి కాకుండా ఫిలాసఫర్ గా కొటేషన్ తో ప్రత్యేకతను చాటుకున్నారు.