ఆహా వేదికగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రసారం కాగా తాజాగా ఇండియన్ ఐడల్ తెలుగు సింగిల్ కాంపిటీషన్ కార్యక్రమం ద్వారా ఆహా పాటకు పట్టాభిషేకం చేసింది. 12 మంది కంటెస్టెంట్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చివరికి వాగ్దేవి విజేతగా నిలిచి మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.ఇక ఈ కార్యక్రమానికి తమన్, నిత్య మీనన్ కార్తీక్ న్యాయనిర్ణేతగా వ్యవహరించడం సింగర్ శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం మొదటినుంచి నువ్వానేనా అన్నట్టుగా పోటీ జరిగి చివరికి విజేతగా వాగ్దేవి టైటిల్ గెలుచుకున్నారు.
ఇలా విజేతగా నిలిచిన ఈమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తన గురించి తెలియజేశారు. నెల్లూరుకు చెందిన వాగ్దేవి చిన్నప్పుడు తన అక్క సంగీతం నేర్చుకోవడంతో తనతో పాటు ఈమె కూడా గొంతు కలపడంతో తనలో ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తనకు సంగీతం నేర్పించారని తెలిపారు.ఈ విధంగా వీరిద్దరి సంగీత ప్రయాణం మొదలైందని వీరిద్దరూ కలిసి వైవా సిస్టర్స్ పేరుతో పలు కచేరీలు కూడా నిర్వహించామని తెలిపారు. ప్రతి ఏడాది జరిగే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో భాగంగా తమ కచేరి తప్పకుండా ఉంటుందని వాగ్దేవి తెలిపారు.
తెలుగు ఇండియన్ ఐడల్ కంటే ముందుగా తాను పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని సెమీఫైనల్స్ వరకు వెళ్దానని తెలిపారు. ఇక ఆహాలో ప్రసారమైన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు చూపిన ఆదరణని ఎప్పటికీ మర్చిపోలేనని అలాగే నిర్ణేతలు బాగా గైడ్ చేశారు. అంతిమ విజేతగా నిలిచి, మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ట్రోఫీ అందుకోవడం నా అదృష్టం అని తెలిపారు.
సెమీఫైనల్స్లో బాలకృష్ణ గారు పాల్గొన్నారు ఇక చివరికి విజయం అందుకున్న తరువాత స్వయంగా బాలకృష్ణ గారు ఫోన్ చేసి అభినందించారని వాగ్దేవి తెలిపారు. ఈ కార్యక్రమం నా జీవితంలో ఓ మైలురాయి అంటూ వాగ్దేవి వెల్లడించారు.ఇక ఇందులో విజయం పొందిన తర్వాత తనకు కూడా అవకాశాలు వస్తున్నాయని ఆమె వెల్లడించారు.